రజనీకాంత్ తన కొత్త సినిమా “కాలా” ఆడియో ఫంక్షన్ లో రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖలు చేశారు. ధనుష్ నిర్మాణంలో రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా జూన్ మొదటి వారంలో విడుదల కానుంది.
తన సినిమాలోని ఈ విలన్ ల గురించి మాట్లాడుతూ రజనీకాంత్, తాను నటించిన చిత్రాల్లో తనకు నచ్చిన విలన్లు ఇద్దరేనని, ఒకరు ‘బాషా’ చిత్రంలో ఆంటోని (రఘువరన్) కాగా, మరొకరు ‘పడయప్పా’ నీలాంబరి (రమ్యకృష్ణ) అని, ఆ ఇద్దరికి దీటుగా కాలా చిత్రంలో నానాపటేకర్ హరిదారా పాత్ర ద్వారా విలన్‌గా నటించారని పేర్కొన్నారు. బాలీవుడ్ నటుడు నానాపటేకర్ దక్షిణాది సినిమాల్లో నటించడం కొత్తేమీ కాదు. గతంలో భారతీరాజా దర్శకత్వంలో వచ్చిన సినిమాలో దర్శకుడి పాత్ర తో మెప్పించారు. అయితే పాత్ర ఎంతో నచ్చితే తప్ప ఆయన దక్షిణాది చిత్రాలు ఒప్పుకోవడం లేదు. ఈ లెక్కన నానాపటేకర్ నటనను అభిమానించే ప్రేక్షకులకు ఈ చిత్రం కనువిందు చేయనునట్టే.
దర్శకుడితో రజనీకాంత్ కబాలి తర్వాత రెండవ సారి ఈ చిత్రంతో పనిచేస్తున్నారు. కబాలి సినిమా ఆశించిన విజయం సాధించలేదు మరి ఈసారైనా రంజిత్ రజనీకాంత్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా అనేది జూన్ మొదటి వారంలో తెలుస్తుంది.