తెలుగు చిత్ర పరిశ్రమలో నటి శ్రీరెడ్డి పెట్టిన చిచ్చు చల్లారలేదు. శ్రీరెడ్డి వ్యవహారంలో టాలీవుడ్ పెద్దల మధ్య విబేధాలు కూడా వచ్చాయని ప్రచారం జరుగుతోంది. అది అలా ఉండగానే ఇప్పుడు.. శ్రీరెడ్డి… ఇండస్ట్రీని మరో విధంగా షేక్ చేస్తోంది. అయితే ఇది నేరుగా.. ఇండస్ట్రీని, ఇండస్ట్రీ పెద్దలను టార్గెట్ చేసుకున్నట్లుగా కాకుండా బాధితులకు అండగా ఉండేందుకు ఎంత వరకైనా వెళ్తున్నారు శ్రీరెడ్డి. టాలీవుడ్ బాధితులకు న్యాయం చేసేందుకు ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్తున్నారు… అవసరమైతే…అక్కడ సర్కార్ స్టైల్లో దాడులకు కూడా తెగబడుతున్నారు.
నాలుగు రోజుల క్రితం నటుడు బాలాజీపై ఫిర్యాదు కోసం ఓ మహిళను తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు. కేసు నమోదు చేయించారు. దీనికి సంబంధించి చాలా పెద్ద డ్రామానే నడిపారు. చివరికి బాలాజీ కూడా వచ్చి ఏం జరిగిందో పోలీసులకు వివరించారు. డాక్యుమెంట్లు అన్నీ చూపించారు. చివరికి.. పోలీసులకు బాలాజీపై కేసు నమోదు చేయక తప్పని పరిస్థితి శ్రీరెడ్డి కల్పించారు. ఇలా ఉండగానే… ఓ కో ఆర్డినేటర్…మరో జూనియర్ ఆర్టిస్టును మోసం చేసిన కేసులో…. శ్రీరెడ్డి సంచలనం రేపారు. తన ఆధ్వర్యంలో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించడమే కాదు… అక్కడున్న నిందితుడిపై చెప్పులతో కొట్టించారు. ఈ వ్యవహారం కూడా కలకలం రేపుతోంది.
శ్రీరెడ్డి పోరాటం టాలీవుడ్లో కింది స్థాయిలో బాధలు పడి… మోసపోయిన చాలా మందిని ఆకర్షించింది. ఎలాగైనా.. న్యాయం పొందాలనుకునేవారు… చాలా మంది శ్రీరెడ్డి వద్దకు వెళ్తున్నారు. ఇదేదో బాగుందనుకుని శ్రీరెడ్డి కూడా… వీరికి న్యాయం చేసేందుకు తనదైన స్టైల్లో ప్రయత్నాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. తనకు పబ్లిసిటీతో పాటు…. ఓ సేవియర్గా గుర్తింపు కూడా వస్తూండటంతో… ఇక ఉద్యమకారిణిగా పూర్తి సమయం కేటాయించే ఆలోచనల్లో కూడా శ్రీరె్డ్డి ఉన్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే ఆమె వద్దకు… టాలీవుడ్లో కింది స్థాయి వ్యక్తుల చేతుల్లో మోసపోయిన వారు క్యూ కడుతున్నారట. ఆమె టేకప్ చేసే కేసులు… టాలీవుడ్లో కొత్త వివాదాల్ని సృష్టించే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీరెడ్డి మెంటాలిటీ చూస్తే.. ఎవరు చెప్పినా వెనుకడుగు వేసే అవకాశాల్లేవు. ఇది కూడా ఒకందుకు మంచిదే అనే వాళ్లు కూడా టాలీవుడ్లో ఉన్నారు. బాధితులకు ఓ అండ ఉంటుందనేది వారి అభిప్రాయం.