ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు… ఆంధ్రప్రదేశ్లో ఐదు లోక్సభ స్థానాలకు ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందని… పార్టీ సమావేశంలో ప్రకటించారు. చంద్రబాబు చెప్పారంటే… అందులో ఎంతో కొంత లాజిక్ …ఉంటుంది. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో.. ఆయన అనుభవం… ప్రస్తుత బీజేపీ నేతల రాజకీయ వ్యూహాలు అన్నీ బేరీజు వేసుకుని ఆయన ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు. ఢిల్లీ నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం…చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసినట్లు టీడీపీ వర్గాలు గట్టిగానే ప్రచారం చేస్తున్నాయి.
కానీ చంద్రబాబు చెప్పినట్లు… ఉపఎన్నికలు వచ్చే అవకాశం ఉందా..? అంటే కష్టమేనని చెప్పాలి. జూన్ రెండో తేదీలోపు… రాజీనామాలు ఆమోదిస్తే… లోక్ సభ సభ్యుల పదవీ కాలం ఏడాదిలోపే ఉంటుంది. కాబట్టి ఎన్నికలు నిర్వహణ … ఈసీ విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది. సాధారణం.. ఏడాదిలోపు పదవీ కాలం ఉంటే ఈసీ ఎన్నికలను నిర్వహించడానికి ఇష్టపడదు. కానీ చంద్రబాబు చెప్పినట్లు.. ఇక్కడంతా రాజకీయమే కాబట్టి… బీజేపీ చెప్పినట్లు ఈసీ నడుస్తుంది అనుకుందాం.. రెండో తేదీ రాజీనాలు ఆమోదిస్తే.. వెంటనే ఈసీ గెజిట్లో ప్రకటించి.. షెడ్యూల్ విడుదల చేసేయవచ్చు. ఎంత లేదన్నా దానికి ఒకటి నుండి ఆరు నెలల సమయం పడుతుంది.
నిజంగానే బీజేపీ ఉపఎన్నికలకు సద్ధమవుతుందా..?. ఏపీ విషయంలో బీజేపీకి ఎలాంటి ఆసక్తులు లేవు. ఉపఎన్నికలు అంటూ వస్తే పోయేది కానీ వచ్చేది కానీ ఏమీ లేదు. కానీ పరోక్షంగా ఆ పార్టీపై ప్రభావం ఉంటుంది. ఉపఎన్నికల్లో టీడీపీని దెబ్బకొడితే… ఆ పార్టీ వీక్ అవుతుందని.. ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై ఉటుందని బీజేపీ భావిస్తోంది. వైసీపీ రాజీనామా చేసిన సీట్లు… ఆ పార్టీకి కంచుకోటలని.. ఏమి చేసినా ఓడిపోరని ఆ పార్టీ భావిస్తే… నిజంగానే ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉంది. కానీ ఆ సీట్లు అలాంటివా.. అంటే.. ఒక్క కడప మినహా…మరో దానిపై ఆశలు పెట్టుకోలేని పరిస్థితి ఉంది. తిరుపతి, నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ స్థానాల్లో గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీలు ఇరవై వేల లోపే. నల్లారి కుటుంబం టీడీపీలో చేరికతో రాజంపేటలోనూ టీడీపీ పట్టు పెంచుకుంది. ఒక వేళ హోదాసెంటిమెంట్ను నమ్ముకుని రాజకీయాలు చేద్దామనుకుంటే.. అంత కన్నాపిచ్చితనం ఉండకపోవచ్చు. హోదానే ఎలక్షన్కు సెంటర్ పాయింట్ అయితే.. ఓట్లు గుంపగుత్తగా పడతాయి కానీ.. బీజేపీకి కొమ్ముకాస్తున్న వైసీపీకి పడవు. అదే జరిగితే..టీడీపీ ఘన విజయం సాధిస్తుంది. ఆ ప్రభావం సాధారణ ఎన్నికలపై పడుతుంది. టీడీపీకి తిరుగులేకుండా పోతుంది.
ఏం జరిగినా…తమకు పోయేదేమీ లేదు.. టీడీపీ, వైసీపీల్లో ఏదో ఒకటి ఇబ్బంది పడుతుంది కదా అని బీజేపీ ముందుకెళ్లే చాన్స్ ఉంది. కానీ భవిష్యత్ రాజకీయాలకు చూసుకుంటే మాత్రం.. ఆ ప్లాన్ పనిచేయక పోవచ్చు. రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని వాళ్లకి కూడా క్లారిటీ ఉంటుంది. ఇప్పుడు ఏపీతో ఇలాంటి గేమ్స్ ఆడితే.. ఆ ప్రభావం ఇతర రాష్ట్రాలపైనా ఉంటుంది. ముఖ్యంగా టీడీపీ గెలిస్తే… బీజేపీ డబుల్ ఫాల్ట్ చేసినట్లవుతుంది. ఎలా చూసినా… ఉపఎన్నికలు రావడం కష్టమే. మరి చంద్రబాబు ఎందుకు అలా చెప్పారు.. అంటే సింపుల్ లాజిక్… ఆయన తన క్యాడర్ను ఎన్నికలకు ఇప్పటి నుంచే సిద్ధం చేయాలనుకున్నారు. అందుకే.. ఏడాదిలో వచ్చే ఎన్నికల కన్నా .. ఉపఎన్నికలను… టార్గెట్గా చూపిస్తున్నారు..అంతే…!