కేంద్ర సమాచార, జౌళి శాఖల మంత్రి స్మృతి ఇరానీకి ప్రధానమంత్రి నరేంద్రమోదీ మరోసారి డిమోషన్ ఇచ్చారు. అత్యంత కీలకమైన కేంద్ర సమాచార శాఖను తప్పించి ఆమెకు.. ఒక్క జౌళి శాఖను మాత్రమే ఉంచారు. నరేంద్రమోదీ ఇలా చేయడం ఇదే మొదటి సారి కాదు. తొలుత తన కేబినెట్లోకి స్మృతి ఇరానీని తీసుకున్నప్పుడు… ఆమెకు… హెచ్ఆర్డీ మినిస్ట్రీ ఇచ్చారు మోదీ. ఆ తర్వాత ఆమెను ఆ శాఖ నుంచి తప్పించి ప్రకాష్ జవదేవర్కు అప్పగించారు. ఇప్పుడు రెండోసారి ఆమెకు డిమోషన్ ఇచ్చారు.
నరేంద్రమోదీ ఆమెపై పగ తీర్చుకుంటున్నారా..? లేక వివాదాల కారణంగానే ప్రాధాన్యత తగ్గిస్తున్నారా అన్న అంశంపై బీజేపీలోనే పెద్దగా క్లారిటీ లేదు. గుజరాత్ ముఖ్యమంత్రిగా మోదీ ఉన్నప్పుడు.. చెలరేగిన అల్లర్ల కారణంగా ఆయనను… సీఎం పదవి నుంచి తప్పించాలని.. స్మృతి ఇరానీ నిరాహారదీక్ష చేశారు. దీన్ని గుర్తు పెట్టుకునే స్మృతి ఇరానీ ప్రాధాన్యాన్ని తగ్గిస్తూ.. రాజకీయంగా మళ్లీ మళ్లీ బలపడకుండా చేస్తున్నారని చెబుతున్నారు. మరికొంత మంది .. ఆమె ఏ శాఖ నిర్వహిస్తున్నా.. వివాదాలు కొని తెచ్చుకుంటున్నారని.. అందుకే మోదీ తొలగిస్తున్నారని చెబుతున్నారు. అత్యంత కీలకమైన హెచ్ఆర్డీ మినిస్టర్ గా ఉన్నప్పుడు… ఆమె విద్యార్హతలపై వివాదం తలెత్తింది. హెచ్సీయూలో జరిగిన రోహిత్ వేముల ఆత్మహత్య ఘటనను సరిగ్గా డీల్ చేయలేపోయారు. దాంతో మోదీ ఆమెకు… సమాచారప్రసార, జౌళి మంత్రిత్వ శాఖలను అప్పగించారు.
అయితే రెండు రోజుల కిందట… నాలుగేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రచారం, ప్రకటనల కోసం ఏకంగా రూ. 4343 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం బయటకు వచ్చింది. ఆర్టీఐ కింద వచ్చిన ధరఖాస్తుకు సమాచార మంత్రిత్వ శాఖ ఈ వివరాలు ఇచ్చింది. నరేంద్రమోదీ ప్రచార కండూతి కోసం ప్రజాధనం వేల కోట్లు ఖర్చు పెడుతున్నారని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇలాంటి కీలకమైన సమాచారాన్ని బయటపెట్టి… స్మృతి తన ఇమేజ్ను దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారని మోదీ ఆగ్రహించినట్లు తెలుస్తోంది. దాని ఫలితమే.. ఇక ఎలాంటి ప్రాధాన్యతా లేని.. జౌళిశాఖకు పరిమితం చేయడం. “క్యోంకీ సాస్ భీ కభీ బాహు ధీ” సీరియల్తో వచ్చిన పాపులారిటీతో… రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు పొందారు. బీజేపీకి ఉన్న అతి సమర్థులైన వక్తల్లో ఒకరు స్మృతి ఇరానీ. కానీ ఆమె ప్రాభవం రాను రాను తగ్గిపోతుంది.