వైకాపా అధినేత విజయసాయిరెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకోవడంలో మాస్టర్ అయిపోయినట్టున్నాడు. గతంలో మత్స్యకారుల దీక్ష వద్దకు వెళ్లి వాళ్ళ కరపత్రం పసుపు రంగు లో ఉందని వాళ్ల మీద విరుచుకు పడి సెల్ఫ్ గోల్ వేసుకున్న ఉదంతం, పార్లమెంటులో మోడీకి మీద పడి నమస్కారం చేసి బీజేపీ పైన పీకల దాకా ఉన్న ఆంధ్ర ప్రజల దృష్టిలో చులకన అవ్వడం తెలిసిందే. ఇప్పుడు ఈ సిరీస్ లో విజయసాయిరెడ్డి కొత్త సెల్ఫ్ గోల్ పవన్ కళ్యాణ్ దీక్షను ఆహ్వానించడం అని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
పవన్ కళ్యాణ్ మార్చి నెలలో తెలుగుదేశం మీద విరుచుకుపడడంతో, వైకాపా పార్టీ కి ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది. ప్రభుత్వ వ్యతిరేకత పెంచేలా జనసేన వ్యవహరిస్తోంది కాబట్టి ఆ వ్యతిరేకత చివరకు తమకు లాభిస్తుందని అంచనా వేసింది జగన్ పార్టీ. అప్పట్నుంచి పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన అభిమానం పుట్టుకొచ్చింది వైకాపా నాయకులకు. రోజా లాంటి వారైతే “మా పవన్ కళ్యాణ్” అంటూ వెనకేసుకురావడం మొదలెట్టారు. నిజానికి వ్యూహం ఉన్న ఏ పార్టీ అయినా, అప్పుడే జాగ్రత్తపడాలి. ఎందుకంటే పవన్ అధికార పార్టీ వైపు ఉంటే వ్యతిరేకత మొత్తం జగన్ ఖాతాలోకి వస్తుంది. ఎప్పుడైతే పవన్ ప్రభుత్వ వ్యతిరేకి అయ్యాడో, అప్పుడు పవన్ కళ్యాణ్ తో జగన్ ఈ వ్యతిరేక ఓట్లను పంచుకోవలసి వస్తుంది.
అయితే విజయసాయి రెడ్డి గారి లెక్క మరొక విధంగా ఉన్నట్లు అర్థమవుతోంది. పవన్ కళ్యాణ్ మళ్ళీ చంద్రబాబును తిట్టడానికే వస్తున్నాడు కాబట్టి పవన్ కళ్యాణ్ యాత్రను ఆహ్వానించాలి అన్నట్టు విజయసాయిరెడ్డి వైఖరి ఉంది. అయితే వీడి చర్యలు ఊహాతీతం అన్నట్టుగా పవన్ కళ్యాణ్ ఎప్పుడు ఎవరిని టార్గెట్ చేస్తాడు ఎవరికి తెలియదు. ఒకవేళ ఈ బస్సు యాత్ర లో పవన్ కళ్యాణ్ మళ్ళీ జగన్ పై గతంలో చేసిన ఆరోపణలు- అంటే తండ్రి చనిపోయిన వెంటనే ముఖ్యమంత్రి పదవి వారసత్వంగా కావాలని కోరుకున్నాడు లాంటివి – మళ్లీ బయటికి తీస్తే ఇప్పుడు ఆహ్వానించినందుకు అప్పుడు తీరిగ్గా చింతించాల్సి ఉంటుంది. పోనీ ఆరోపణలు చేయడని అనుకున్నా, ఒకవేళ పవన్ కళ్యాణ్ బస్సు యాత్ర సక్సెస్ ప్రజల్లో కి బాగా వెళ్ళగలిగితే, అప్పుడు వైకాపా డిఫెన్స్ లో పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోయే అవకాశం ఉందని అప్పుడు అర్థం చేసుకున్నా ప్రయోజనం ఉండదు.
ఏ లెక్కన చూసుకున్నా విజయసాయిరెడ్డి సెల్ఫ్ గోల్ జాబితా లో ఇది మరొక సెల్ఫ్ గోల్ అనే చెప్పాలి