ఆఫీసర్ మొదలైనప్పుడు ఉన్న బజ్.. ఇప్పుడు లేదు. ప్రోమోలు, ట్రైలర్లతో ఈ సినిమాకి కిక్ రాలేదు. నాగార్జున లుక్ కూడా ఏమాత్రం సంతృప్తి కలిగించడం లేదు. `ఆఫీసర్` తెలుగులో వర్మకి చిట్ట చివరి సినిమా అంటూ.. సోషల్ మీడియాలో కామెంట్లు జోరందుకున్నాయి. మరోవైపు తెలుగు చిత్రసీమ కూడా వర్మపై గుర్రుగా ఉంది. వర్మలాంటి వాడ్ని పరిశ్రమ నుంచి బహిష్కరించాలని కొంతమంది గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్మ నుంచి మరో తెలుగు సినిమా రావడం కష్టమే అన్న టాక్ వినిపించింది. అయితే.. నాగార్జున మాత్రం వర్మని మరోసారి బలంగా నమ్మాడు. ఆఫీసర్ సెట్స్‌పై ఉండగానే అఖిల్ – వర్మ కాంబో సెట్ చేశాడు. అయితే… ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అఖిల్ సినిమా పక్కకు వెళ్లిపోతుందనుకున్నారంతా. కానీ.. నాగ్ మాత్రం వర్మని ఇంకా నమ్ముతూనే ఉన్నాడు. అఖిల్‌తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు నాగ్. వచ్చే నెలలో షూటింగ్ మొదలవుతుందని సమాచారం. ఇదో కాలేజీ నేపథ్యంలో సాగే కథ అని, అఖిల్ కాలేజీ విద్యార్థిగా కనిపించబోతున్నాడని టాక్. శివ తరవాత వర్మ కాలేజీ నేపథ్యంలో సినిమాలు పెద్దగా చేయలేదు. కాబట్టి.. ఈసినిమాపై ఆసక్తి పెరిగే ఛాన్స్ ఉంది. ఇది వరకే ఈ సినిమాకి సంబంధించి కొన్ని ట్రైల్ షూట్స్ కూడా చేశారట. వాటిపై నాగ్ పూర్తి సంతృప్తితో ఉన్నాడని, ఆఫీసర్ రిలజ్ట్తో సంబంధం లేకుండా ఈ సినిమాని ఓకే చేశాడని తెలుస్తోంది.