నకిలీ సరిఫికేట్స్ కుంభకోణం వల్ల ఎంతమంది విద్యార్థులు జీవితాలు చిక్కుల్లో పడుతున్నాయనే కథాంశంతో తెరకెక్కిన తమిళ సినిమా ‘కణిదన్’. తెలుగులో నిఖిల్ హీరోగా ‘ఠాగూర్’ మధు నిర్మాణంలో రీమేక్ అవుతోంది. ఇందులో కథానాయికగా తమిళ సినిమాలో నటించిన కేథరిన్ దగ్గర్నుంచి తెలుగు ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలినీ పాండే వరకూ పలువురి పేర్లను పరిశీలించారు. ‘నాన్నా… అదిగో పులి’ అన్నట్టు ‘అదిగో హీరోయిన్.. కన్ఫర్మ్’ అని ఫీలర్లు వదిలారు. ఇంత తతంగం నడవడానికి బోలెడు కారణాలున్నాయి. దర్శక నిర్మాతలకు నచ్చిన హీరోయిన్, హీరోకి నచ్చలేదు. హీరోకి నచ్చిన హీరోయిన్ దర్శక నిర్మాతలకు నచ్చలేదు. కిందా మీదా పడిన తరవాత చివరకి ‘అందాల రాక్షసి’ ఫేమ్ లావణ్య త్రిపాఠిని సెలెక్ట్ చేశారు. ‘ఠాగూర్’ మధు ఓ నిర్మాతగా వచ్చిన ‘మిస్టర్’లో ఈ డెహ్రాడూన్ బ్యూటీ ఓ హీరోయిన్. సినిమాలో ఆమెది మీడియా ఛానల్ అధినేత కుమార్తె. లావణ్య అయితే ఇటు కథకు అవసరమైన చోట మోడ్రన్ గానూ.. అటు ట్రెడిషనల్ గానూ కనిపిస్తుందని ఆయన భావించార్ట. నిర్మాత రికమండ్ చేయడంతో లావణ్యను సెలెక్ట్ చేశార్ట. నిఖిల్ ఆమె దగ్గర ఆగక తప్పలేదని సమాచారమ్!!