తెలుగు సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ రగడ ఇంకా చల్లారలేదు. అమ్మాయిల ఆత్మ గౌరవం, ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు దగ్గర మొదలైన శ్రీరెడ్డి పోరాటం ఇప్పుడు వ్యక్తిగత స్థాయికి చేరిందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. వర్మ సలహా మేరకు క్యాస్టింగ్ కౌచ్ వివాదంలో పవన్ కల్యాణ్ మీద నోరు పారేసుకున్న శ్రీరెడ్డి తర్వాత అభిమానుల ఆగ్రహం చవి చూడాల్సి వచ్చింది. ఆమె క్షమాపణలు కోరినా.. అప్పటికే ఆలస్యమైంది. చాలామంది పవన్ అభిమానులు ఆమెపై నోరు పారేసుకున్నారు. హద్దులు దాటి మాట్లాడారు. అటువంటి అభిమానులపై సైబర్ క్రైమ్ విభాగంలో శ్రీరెడ్డి కేసులు పెట్టారు. అభిమానుల మాటలు ఆమె మనసును బాధించి ఉండవచ్చు. అందుకే, ఆమె కేసులు పెట్టి ఉండవచ్చు. అలాగే, యూట్యూబ్ సెన్సేషన్స్ డార్లింగ్ దాస్, లబో తదితరులపై కేసులు పెట్టారు. ఇవన్నీ పక్కన పెడితే… జీవితా రాజశేఖర్ మీద కూడా ఆమె కేసు పెట్టడం పలువురికి ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే… జీవిత ఆగ్రహావేశాలు వ్యక్తం చేసింది సామాజిక కార్యకర్త సంధ్యపై. శ్రీరెడ్డిని పెద్దగా ఏమీ అనలేదు. “ఒకసారి.. రెండుసార్లు మోసపోతే ఓకే. పదేళ్లుగా మోసపోతే ఎవరిది తప్పు?” జీవిత ప్రశ్నించారు. అందుకు కేస్ పెట్టారో? జీవిత కూడా ఏమైనా హద్దులు దాటి మాట్లాడారో? ఇలా మొత్తం మీద 41మందిపై శ్రీరెడ్డి కేసులు పెట్టారు. “ఒక్కొక్కడి తాట వలుస్తా జాగ్రత్త, ఈశ్వరుడు నోరు ఇచ్చాడు కదా అని నోటి కొచ్చినట్లు తిట్టారుగా, సైబర్ క్రైమ్ లో 41 Members మీద కేసులు పడ్డాయి” అని సోషల్ మీడియాలో శ్రీరెడ్డి పేర్కొన్నారు.