చిరంజీవి పెద్ద కుమార్తె సుష్మితతో ఉదయ్‌కిరణ్ ప్రేమ వ్యవహారం నిశ్చితార్థం వరకూ వెళ్లడం, తరవాత గొడవల కారణంగా పెళ్లి క్యాన్సిల్ కావడం తెలిసిన ప్రేక్షకులందరికీ తెలిసిన విషయాలే. ఆ పెళ్లి క్యాన్సిల్ అయిన తరవాత ఉదయ్‌కిరణ్ కెరీర్లో కుదుపులు మొదలయ్యాయనీ, దానివెనుక మెగా ఫ్యామిలీ హస్తం వుందనీ అప్పట్లో గుసగుసలు వినిపించాయి. అవి నిజమేనా? కాదా? మెగా ఫ్యామిలీకి, ఉదయ్కిరణ్కి మధ్య ఏం జరిగింది? అనే అంశాలు దర్శకుడు తేజ తెరకెక్కించబోయే ఉదయ్‌కిరణ్ బయోపిక్‌లో మెయిన్ టాపిక్ అని తెలుస్తోంది. మరి, మెగా ఫ్యామిలీని విలన్లుగా చూపిస్తారో? వున్నది వున్నట్టుగా నిజాలను తెరకెక్కిస్తారో? బయోపిక్‌కి ‘కాబోయిన అల్లుడు’ అనే టైటిల్ రిజిస్టర్ చేయించడం ద్వారా ఇటు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో తేజ ఆసక్తి కలిగించాయి. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్లో ఈ టైటిల్ రిజిస్టర్ అయ్యింది. ఉదయ్ కిరణ్ బతికున్న రోజుల్లోనే ఈ బయోపిక్ గురించి, మెగా ఫ్యామిలీతో పెళ్లి వివాదం సినిమాలో చూపించడం గురించి అతడితో తేజ డిస్కస్ చేశార్ట.