వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు శర్వానంద్. ఇప్పుడు తన చేతిలో రెండు సినిమాలున్నాయి. సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు శర్వా. మరోవైపు హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న `పడి పడి లేచె మనసు`లోనూ నటిస్తున్నాడు. సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అప్పుడే ఈ సినిమాకి బిజినెస్ మొదలైపోయింది. రెండు తెలుగు రాష్ట్రాల హక్కుల్ని ఏసియన్ సినిమాస్ సంస్థ దక్కించుకుంది. రూ.21 కోట్లకు ఆంధ్రా, తెలంగాణ థియేటరికల్ రైట్స్‌ని కైవసం చేసుకుంది. శాటిలైట్, డిజిటల్, బెంగళూరు రైట్స్ కలిపితే మరో రూ.10 కోట్లు రావొచ్చు. ఓవర్సీస్ ఉండనే ఉంది. మొత్తానికి.. 35 కోట్ల వరకూ బిజినెస్ జరగడం ఖాయం. హనుకి `లై` అనే డిజాస్టర్ ఉన్నప్పటికీ.. శర్వా, సాయి పల్లవిల మ్యాజిక్ ఈసినిమాకి బాగా కలిసొచ్చింది. మొత్తానికి నిర్మాతకు దాదాపు రూ.10 కోట్ల వరకూ టేబుల్ ప్రాఫిట్ దక్కే ఛాన్సుందని తెలుస్తోంది.