రవితేజ ‘నేల టిక్కెట్టు’ ఆడియోకి పవన్‌కల్యాణ్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. అంతకు ముందెన్నడూ ఇతర హీరోల వేడుకల్లో సందడి చేయనంతగా సందడి చేశాడు. వేడుకలో ఉన్నంతసేపూ సరదాగా కనిపించాడు. పవన్, రవితేజ మధ్య ఉన్న అనుబంధం చూసి ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. అయితే… ఆడియో వేడుక ముగిసిన తర్వాత అసలు ఘట్టం మొదలైంది. రవితేజ ప్యాంటులో పవన్ వేలు పెట్టినట్టుగా ఉంటే స్టిల్ వైరల్ అయ్యింది. పవన్ ఎప్పుడు దొరుకుతాడా? అని ఎదురుచూసే సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ అయితే… ఇద్దరిదీ తొడ సంబంధం కింద అభివర్ణించారు ట్విట్టర్లో! అక్కణ్ణుంచి ఈ ఫొటోపై విపరీతమైన ట్రోల్స్ మొదలయ్యాయి. వర్మ కామెంట్స్, ట్రోల్స్‌పై రవితేజను అడగ్గా… ఈ రోజు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పందించారు.
‘‘పవన్ ఆ రోజు ఏం చేశాడంటే… నేను టోన్డ్ జీన్స్ (చిన్న చిన్న చిరుగులు ఉంటే జీన్స్) వేసుకున్నాను కదా! ఆయన అది చూశారు. ఓ చోట దారాలు దారాలుగా ఉంది. వాటిలో ఓ దారాన్ని పట్టుకుని లాగారు. అంతకు మించి ఏం లేదు. దాని మీద ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ చేశారు. పోన్లెండి’’ అని రవితేజ వ్యాఖ్యానించారు. కామెంట్స్‌ని ఆయన లైట్ తీసుకున్నారు.