తెలుగులో దాదాపు స్టార్స్ అందరితోనూ నటించేసింది ఇలియానా. అయితే తను మాత్రం ‘నా ఫేవరెట్ కో స్టార్ రవితేజ’ అంటుంటుంది. దానికీ కారణం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో మూడు సినిమాలొచ్చాయి. అందులో ‘కిక్’ సూపర్ హిట్టయ్యింది. సెట్లో రవితేజ అల్లరి ఇలియానాకు బాగా నచ్చుతుందట. అంతేకాదు… బయట కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడట. అందుకే ఇలియానాకి రవితేజ అంటే అంత ఇష్టం ఏర్పడింది. అందుకే.. ఇప్పుడు రవితేజ ఇలియానాని రికమెండ్ చేయగలిగాడు. ‘అమర్ అక్బర్ ఆంటోని’తో ఇలియానా రీ ఎంట్రీ ఇవ్వడానికి గల కారణం.. పూర్తిగా రవితేజనే అని తేలింది. రవితేజ రికమెండేషన్ వల్లే చాలా కాలానికి ఓ తెలుగు సినిమా సంపాదించుకోగలిగింది ఈ గోవా బ్యూటీ.
నిజానికి ఇలియానిని టాలీవుడ్ ఎప్పుడో మర్చిపోయింది. ఆమెకు ఒకప్పుడు ఉన్న క్రేజ్ ఇప్పటికీ ఉందనుకోవడం అవివేకమే అవుతుంది. ఉత్తరాదిన కూడా ఇలియానా ఖాళీ అయిపోయింది. ఈ దశలో తెలుగులో ఓ అవకాశం రావడం నిజంగా ఇలియానా లక్ అనుకోవాలి. ఆ లక్ తెచ్చిపెట్టింది మాత్రం రవితేజనే. ‘ఈ సినిమాలో ఇలియానాని తీసుకోండి’ అంటూ దర్శక నిర్మాతలకు రవితేజ చెప్పాడట. శ్రీనువైట్ల ఫ్లాపుల్లో ఉన్నాడు. కాబట్టి రవితేజ ఏం చెప్పినా వినాల్సిందే. నిర్మాతలూ కాదనలేకపోయారు. దాంతో ఎవరికి ఇష్టం ఉన్నా లేకపోయినా.. ఇలియానా వచ్చేసింది. ‘ఫేవరెట్ కో స్టార్’ అనే మాటకు రవితేజ మరోసారి సంపూర్ణ న్యాయం చేసినట్టైంది.