తెలుగులో మల్టీస్టారర్ సినిమాల జోరు పెరిగింది. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నాని ఓ సినిమా చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ నటించనున్నారు. బడా హీరోలతో పాటు చోటా హీరోలు సైతం మల్టీస్టారర్ సినిమాలకు సంతకాలు చేస్తున్నారు. అందులో దర్శక-నటుడు అవసరాల శ్రీనివాస్, సీనియర్ నరేష్ కుమారుడు నవీన్ విజయకృష్ణ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ ఒకటుంది. చడీచప్పుడు లేకుండా సైలెంట్‌గా సినిమా అవసరాల-నవీన్ మల్టీస్టారర్ మొదలైంది. ప్రస్తుతం లక్ష్మీ పార్వతి ఇంట్లో ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. ఈ సినిమాతో బాలాజీ అనే యువ ప్రతిభాశాలి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఇందులో హీరోల పాత్రలు ఎలా వుంటాయో మరి!
గతేడాది ‘బాబు బాగా బిజీ’తో సోలో హీరోగా, ‘అమీ తుమీ’లో మల్టీస్టారర్ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన అవసరాల, తరవాత ‘ఒక్క క్షణం’, ‘అ!’లో కీలక పాత్రలు చేస్తారు. ‘మహానటి’లో అతిథిగా కనిపించారు. మళ్ళీ హీరోగా నటించడమిదే. ‘నందిని నర్సింగ్ హోమ్’ విడుదల తరవాత నవీన్ విజయకృష్ణ నటిస్తున్న చిత్రమిది.