తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలనే ఆలోచన వచ్చిందే తడవుగా కార్యాచరణ ప్రారంభించారు. కాంగ్రెస్ వ్యతిరేక, బీజేపీ వ్యతిరేక విధానంతో ఆయన తన స్పష్టమైన కార్యాచరణను ప్రకటించారు. ప్రాంతీయ పార్టీల నేతలు పిలిచారో… ఆయనే అపాయింట్మెంట్లు తీసుకుని వెళ్లారో కానీ… మొత్తానికి.. కొంత మంది నేతలతో కేసీఆర్ … కేసీఆర్ తో మరికొంత మంది నేతలు సమావేశమయ్యారు. ఇన్ని పార్టీలు ప్రయత్నం చేసినా… కేసీఆర్ ప్రతిపాదిత ఫెడరల్ ఫ్రంట్‌లో భాగస్వామ్యం అవుతామని.. ఒక్కటంటే.. ఒక్క పార్టీ కూడా ప్రకటించలేదు. అదే సమయంలో ఆయన ప్రయత్నాలకు.. కుమారస్వామి ప్రమాణ స్వీకారం పెద్ద ఇబ్బందినే తెచ్చిపెట్టింది. ఆ ప్రమాణస్వీకానికి వెళ్లలేక.. జేడీఎస్‌ను దూరం చేసుకోలేక ప్రమాణస్వీకారానికి ఒక రోజు ముందు వెళ్లి అభినందించి వచ్చారు. కానీ … వెళ్లి ఉంటే ఫెడరల్ ఫ్రంట్ అన్ని ప్రయత్నాలూ చేయడానికి అవకాశం దొరికి ఉండేది.
ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో “ఫ్రంట్” డ్రైవింగ్ టీడీపీ అధినేత చంద్రబాబు చేతుల్లోకి వచ్చి పడే పరిస్థితి కనిపిస్తోంది. స్వయంగా కేసీఆర్ కోల్ కతా వెళ్లి కలసి వచ్చిన.. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ… చంద్రబాబును బీజేపీ వ్యతిరేక కూటమి వైపు ప్రొత్సహించారు. మాయావతి సమర్థించారు. అక్కడిక్కడే వామపక్ష నేతలతోనూ చర్చించిన చంద్రబాబు ఇప్పుడు కార్యాచారణ చేసుకుంటున్నారని వార్తలొస్తున్నాయి. కుమారస్వామి ప్రమాణ స్వీకారోత్సవానికి మొత్తం పదమూడు పార్టీలు వచ్చాయి. ఆయా పార్టీల రాష్ట్రాలకు వెళ్లి చంద్రబాబు స్వయంగా చర్చలు జరపబోతున్నారు. “ఏపీకి జరిగిన అన్యాయానికి పోరాటంకి మద్దతు” అనే బేస్ మీదే ఈ కూటమి ఏర్పడనుంది. అందుకే అమరావతి వేదికగా జరపబోయే ధర్మపోరాట సభలో దీన్ని ప్రకటించబోతున్నారని ఇప్పటికే అందరూ గట్టిగా నమ్ముతున్నారు.
అయితే.. ప్రాంతీయ పార్టీలన్నీ.. కూటమిగా ఏర్పడేందుకు ఆసక్తి చూపిస్తాయా అన్నది మాత్రం తేలాల్సిన విషయం. కేసీఆర్ ప్రయత్నాలకూ ఎవరూ మద్దతు తెలుపలేదు. భుజం తట్టారు అంతే. ఎందుంటే.. ఆయా పార్టీలన్నీ… కాంగ్రెస్ తో అంతో ఇంతో సన్నిహితంగా మెలగడం. ఇప్పుడు చంద్రబాబు కూడా.. రెండు జాతీయ పార్టీలకూ దూరం. కానీ… బీజేపీకి ఎక్కువ దూరం. కేసీఆర్ కాంగ్రెస్‌కు ఎక్కువ దూరం. అదే ఆయనకు మైనస్ అయింది. అంటే ఇప్పుడు కేసీఆర్ వెళ్లినట్లే ప్రత్యేక విమానాల్లో చంద్రబాబు దేశంలో ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్న రాష్ట్రాలకు వెళ్లబోతున్నరు. వారినందర్నీ బీజేపీకి వ్యతిరేకంగా కూటమిగా చేయబోతున్నారు. ఈ విషయంలో కేసీఆర్ చేయలేదని దాన్ని చంద్రబాబు చేయగలరా..? అన్నదే ఆసక్తికరం. వచ్చే రెండు మూడు నెలల్లో దీనిపై క్లారిటీ రావొచ్చు.