ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకుంటోంది. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. ఎన్టీఆర్ ఇందులో తొలిసారిగా రాయలసీమ మాండలికంలో మాట్లాడబోతున్నాడు. రాయలసీమ భాష తెలుగు చిత్రసీమకు కొత్త కాదు. కాకపోతే… పూర్తిగా సాధికారమైన రాయలసీమ మాండలికం ఈసినిమాలో వినిపించబోతోందట. అందుకోసం త్రివిక్రమ్ పెద్ద కసరత్తే చేశాడు. కొంతమంది రాయలసీమ కవులు, రచయితల సహకారం ఈ సినిమా కోసం తీసుకున్నాడు. అందులో పెంచెల దాస్ ఒకరు. పెంచలదాస్ రాయలసీమ కవి, గాయకుడు. ఇటీవల ‘కృష్ఱార్జున యుద్దం’లో ‘దారి చూడు’ అనే పాట రాసిందీ, పాడిందీ తనే. ఈ సినిమా కోసం పెంచలదాస్ సహకారం తీసుకుంటోంది చిత్రబృందం. రాయలసీమ మాండలికంలోని కొన్ని మాటలు, పదాలు పెంచెల దాస్ ద్వారా అడిగి తెలుసుకున్నార్ట. ఎన్టీఆర్ సంభాషణల విషయంలో పెంచెలదాస్ సహాయ సహకారాలు బాగా ఉపయోగపడుతున్నాయని టాక్. రాయలసీమ మాండలికంలో డైలాగులు రాయడం త్రివిక్రమ్‌కి కొత్త. అందుకే.. అందులో పట్టు సాధించడానికి రాయలసీమ రచయితల హ్యాండు కావల్సివచ్చింది.