అమితాబ్ బచ్చన్ హీరోగా రూపొందిన ‘బుడ్డా హోగా తేరా బాప్’ తో పూరి జగన్నాధ్ సినిమా జీవితంలో ప్రవేశించిన ఛార్మి ఇప్పుడు అతని టీమ్ లో ఒక భాగమైపోయింది. తాను టైటిల్ పాత్ర పోషించిన ‘జ్యోతి లక్ష్మి’ మొదలుకొని రీసెంట్ గా వచ్చిన ‘మెహబూబా’ వరకు పూరి దర్సకత్వం వహించిన అన్ని చిత్రాల్లోనూ ఛార్మి హస్తం ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉన్నాయని చెబుతారు.
‘హార్ట్ ఎటాక్’ తర్వాత మళ్ళీ పూరి-నితిన్ దర్శకత్వంలో రూపొందాల్సిన సినిమా క్యాన్సిల్ అవ్వడానికి ఛార్మీయే కారణమనే ఆరోపణలున్నాయి. చార్మీ కారణంగానే తన ‘విన్నింగ్ టీమ్’ మొత్తాన్ని పూరి మార్చేశాడని కూడా చెబుతారు.
తాజాగా ‘మెహబూబా’ పూరి కెరీర్ లో మరో మిజరబుల్ ఫ్లాప్ అయిన నేపథ్యంలో.. ‘ఛార్మి వచ్చాకే పూరి డౌన్ ఫాల్ స్టార్ట్ అయ్యిందనే సెంటిమెంట్ ని దృష్టిలో పెట్టుకుని.. కనీసం సినిమా మేకింగ్ కి సంబంధించిన వ్యవహారాల్లో అయినా ఛార్మి ప్రమేయం లేకుండా చేయాలనీ పూరి శ్రేయోభిలాషులు అతనిపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.
అయితే.. ఫలానా వాళ్ళ వల్లే తనకు ప్లాప్ లు వస్తున్నాయి.. ఫలానా పని చేస్తే హిట్స్ వస్తాయి వంటి సెంటిమెంట్స్ పూరికి తక్కువ. కాబట్టి ఎవరెంత ఒత్తిడి తెచ్చినా ఛార్మిని పూరి టీమ్ నుంచి తప్పించడం సాధ్యం కాని పని అని పూరి సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు!!