“ప్రొడ్యూసర్‌గా చేసేటప్పుడు నాకు జీరో టెన్షన్. ఎందుకంటే… సినిమా ఏం తీస్తున్నానో నాకు అర్థం అవుతుంది. డిస్ట్రిబ్యూటర్‌గా ఓ సినిమాను కొన్నప్పుడు వాళ్ళు ఏం తీస్తున్నారో… తెలియంది కాబట్టి టెన్షన్ వుంటుంది. సో… టెన్షన్ డిస్ట్రిబ్యూటర్‌గానే!”
– కుండబద్దలు కొట్టినట్టు చెప్పేశాడు ‘దిల్’ రాజు. సుధీర్‌బాబు ప్రొడక్షన్స్ లోగో లాంఛ్ నవ్వుతూనే మనసులో మాట బయటపెట్టాడు.
‘దిల్’ రాజు మాటల్లో తప్పేం లేదు. అంతా ఒప్పే. సూపర్ సక్సెస్ రేట్ వున్న నిర్మాతల్లో ఆయన ఒకడు. ఇప్పటి వరకూ నిర్మాతగా 30కి పైగా సినిమాలు తీస్తే… వాటిలో ఎక్కువశాతం విజయాలు వున్నాయి. నష్టాలు వచ్చిన సందర్భాలు అరుదు. అదే సమయంలో పంపిణీదారుడిగా దిల్ రాజు విపరీతమైన నష్టాలు చవిచూశారు. స్టార్ హీరోల ఇమేజ్ మీద నమ్మకం పెట్టుకుని భారీ ఆఫర్స్ ఇచ్చి సినిమాలు కొంటే కోట్లకు కోట్లు నష్టాలు వచ్చాయి. గతేడాది డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజు కంపెనీకి సుమారు 50 కోట్లు లాస్ వచ్చిందట. ఈ ఏడాది కూడా ఆయన డిస్ట్రిబ్యూషన్ చేసిన ‘కృష్ణార్జున యుద్ధం’, ‘మెహబూబా’ సినిమాలు నష్టాలే మిగిల్చాయి. ఒకానొక సమయంలో సినిమా పంపిణీకి సెలవు చెప్పేద్దామని ఆలోచించిన దిల్ రాజు, ప్రస్తుతం ఆచి తూచి సినిమాలు కొంటున్నారు.