తెలంగాణ రెడ్డి సామాజికవర్గ జేఏసీ ఏర్పాటు చేసిన బహిరంగసభలో… సినీ నటి, మాజీ ఎంపీ జయప్రద ప్రధానాకర్షణగా నిలిచారు. అసలు రెడ్డి సామాజివర్గ జేఏసీకి … జయప్రదకు ఏమిటి సంబంధం అన్న చర్చ జోరుగా నడిచింది. ఆమె ప్రసంగించలేదు కానీ.. అందరికీ అభివాదం చేసింది. వేదికపై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. చివరికీ ఎవరికీ అర్థం కాలేదు.. అసలు జయప్రదకు రెడ్డి సామాజికవర్గానికి ఏమిటి సంబంధం అని.. అసలు ఎందుకొచ్చారా అని..!. అయితే జయప్రద తనంతట తానుగా సంబంధం లేని సభలరు రారుగా.. ఎవరో పిలిచి ఉంటారని అందరూ సర్ది చెప్పుకున్నారు. కానీ చాలా మందికి.. అసలు జయప్రదకు… రెడ్డి సామాజికవర్గానికి ఏమిటి సంబంధం అనే..! సభకు వచ్చి ప్రసంగించి వెళ్లిపోయిన ప్రముఖ నేతలందర్నీ ఆమె పలకరించారు. సభకు వచ్చిన వారికి కూడా.. చాలా మందికి.. అసలు ఆమె ను ఎవరు తెచ్చారు.. ? ఏ ఉద్దేశంతో తీసుకొచ్చారో అర్థం కాలేదు.
కానీ అసలు విషయం ఏమిటంటే.. జయప్రదకు రెడ్డి సామాజికవర్గానికి బంధుత్వం ఇటీవలే కలిసింది. తన దత్తపుత్రుడు సిద్ధార్థకు.. తెలంగాణకు చెందిన సత్యనారాయణ రెడ్డి కుమార్తె ప్రవళికతో పెళ్లి చేశారు. ఈ రెడ్డి జేఏసీ సభ నిర్వహణలో సత్యనారాయణరెడ్డి కీలక పాత్ర పోషించారు. వేదికపై కూడా ఉన్నారు. సభకు సినీగ్లామర్ ఉంటుంది కదా.. అని సత్యనారాయణ రెడ్డి బంధుత్వం కొద్దీ… జయప్రదను తీసుకొచ్చినట్లు భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగుపెట్టి.. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లోనూ విజయాలు సాధించిన జయప్రద.. ప్రస్తుతం రాజకీయంగా యాక్టివ్ గా లేరు. ఏ పార్టీలో చేరాలన్నదానిపై ఆమెకు క్లారిటీ లేదు. ఏ పార్టీ కూడా ఆమెకు పిలిచి అవకాశాలిచ్చే పరిస్థితి లేదు.అందుకే ఆమె సైలెంట్ గా ఉన్నారన్న ప్రచారం జరుగుతోంది.
సమాజ్ వాదీ పార్టీ అఖిలేష్ చేతుల్లోకి వెళ్లిన తర్వాత అక్కడ అమర్ సింగ్ కూ ప్రాధాన్యత లేకపోయింది. అందుకే అమర్ సింగ్ కూడా ప్రస్తుతం జయప్రద రాజకీయ భవిష్యత్ కూ ఎలాంటి సాయం చేయలేకపోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెడ్డి సామాజికవర్గ బంధుత్వంతో.. ఆమె.. మళ్లీ తన ప్రయత్నాలు చేసుకునే ఉద్దేశంలో ఉన్నారని.. అందుకే కులసభలోనూ పాల్గొన్నారన్న అంచనాలు వస్తున్నాయి. అదే నిజమైతే.. త్వరలో జయప్రద తెలంగాణ రాజకీయాల్లో తళుక్కుమనే అవకాశం ఉంది. ఆమెకు ఉన్న సినీ తార క్రేజ్ తో పాటు అమర్ సింగ్ లాబీయింగ్ కూడా ఇందుకు వర్కవుట్ అవ్వొచ్చని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒక సారి రాజకీయంలోకి దిగి అధికారం రుచి చూసిన తర్వాత … అందులో నుంచి బయటకు వెళ్లాలని ఎవరూ అనుకోరు.. ఇప్పుడు జయప్రద పరిస్థితి కూడా అదే.