‘నేల టికెట్టు’ విడుదలకు ముంద – ‘రవితేజతో మళ్లీ మళ్లీ సినిమా చేస్తా’ అని ప్రకటించారు ‘నేల టికెట్టు’ నిర్మాత రామ్ తాలూరి. ‘రవితేజ అంటే ఇష్టమేమో’ అనుకున్నారంతా. ఆయన అన్నట్టుగానే రవితేజతో మరో సినిమా చేయడానికి రామ్ తాలూరి రంగం సిద్ధం చేస్తున్నారు. అయితే… ఇదేం రవితేజతో ఇష్టంతోనో, ప్రేమతోనో కాదు. ‘నేల టికెట్టు’ నష్టాల్ని భర్తీ చేయడానికి. రవితేజ – కల్యాణ్ కృష్ణ కాంబినేషన్లో వచ్చిన ‘నేల టికెట్టు’ దారుణ పరాజయాన్ని మూటగట్టుకుంది. వీకెండ్స్‌లో కూడా వసూళ్లు అంతంత మాత్రంగానే అందాయి. ఈ సినిమాతో నిర్మాత పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాడు. నష్ట పరిహార చర్యల్లో భాగంగా రవితేజతోనే మరో సినిమా చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. అక్టోబరు – నవంబరులో ఈ సినిమా పట్టాలెక్కే ఛాన్సుంది. దీనికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తాడా, లేదంటే మరో దర్శకుడు రంగంలోకి దిగుతాడా? అనేది తెలియాల్సివుంది. ‘నేల టికెట్టు’ సెట్స్‌పై ఉండగానే కల్యాణ్ కృష్ణతో మరో సినిమా చేయడానికి ఎగ్రిమెంట్ కుదుర్చుకున్నారు రామ్ తాలూరి. ఆ రకంగా… ఆయన చేతిలో దర్శకుడు ఉన్నట్టే. కానీ.. కల్యాణ్‌కి రవితేజ మరో అవకాశం ఇస్తాడా, లేదా? అనేదే అనుమానంగా మారింది. ఓ సినిమా ఫ్లాప్ అయితే.. ఆ వెంటనే నష్టపరిహారంగా మరో సినిమా మొదలెట్టడం టాలీవుడ్లో తరచూ జరిగేదే. కాకపోతే.. నష్టాలు పూడ్చడానికి తీసిన సినిమాలు కూడా ఫెయిల్ అయ్యాడు. ‘ఆంధ్రావాలా’ తరవాత వచ్చిన ‘నా అల్లుడు’ అందుకు అతి పెద్ద నిదర్శనం. మరి ఈ సినిమా ఏమవుతుందో చూడాలి.