వర్మ సాధారణంగా ఎమోషన్ అవ్వడు. కన్నీళ్లు పెట్టుకోవడం సెంటిమెంటల్‌గా మాట్లాడడం వర్మ కెరీర్లోనే లేదు. అయితే ‘ఆఫీసర్’ ప్రీ రిలీజ్ వేడుకలో ఓ కొత్త వర్మ కనిపించాడు. నాగార్జన గురించి మాట్లాడేటప్పుడు కాస్త ఎమోషనల్ అయ్యాడు. ”నా కంట్లో నీళ్లు కూడా తిరుగుతున్నాయి. కానీ. వాటిని బయటకు రానివ్వను. వస్తే నా రిపిటీషన్ దెబ్బతింటుంది” అంటూ తనదైన శైలిలో మాట్లాడి. ఆ సెన్సిటీవ్ మూమెంట్‌ని దాటేశాడు.
”నేను దేవుడ్ని నమ్మను. పెద్దవాళ్లని గౌరవించను. మంచి పనులూ చేయలేదు. కానీ ఎందుకో నాకు నాగార్జున రూపంలో ఓ మంచోడు దొరికాడు నేనొక అడవి గుర్రంలాంటోడ్ని. ‘శివ’ తరవాత పదివేల దారుల్లో ప్రయాణించాను. ట్వీట్లు చేశాను. కంట్రవర్సీలు సృష్టించాను. అటూ ఇటూ పరిగెట్టాను. మళ్లీ నన్ను దారిలోకి తెచ్చాడు నాగ్. నా స్టీరింగ్ పట్టుకుని అటు వెళ్లు, ఇటు వెళ్లు అంటూ డైరెక్షన్ ఇచ్చాడు. ఈ సినిమాకి ముందు నాగ్‌కి ఓ మాటిచ్చాను. దాన్ని నిలబెట్టుకున్నాననే అనుకుంటున్నా. ఓ దర్శకుడిగా నన్ను నేను మళ్లీ అన్వేషించుకునే అవకాశం ఆపీసర్ కల్పించింది” అన్నాడు వర్మ.