ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన నిధులపై.. అమిత్ షా.. అచ్చంగా కేంద్రమంత్రిలాగా స్పందిస్తారు. యుటిలిటి సర్టిఫికెట్లు ఇవ్వలేదని తేల్చేస్తారు. ఏపీకి ఏమైనా నిధులు కావాలంటే.. అమిత్ షా పర్మిషన్ ఉండాల్సినందేని ఓ వైపు ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ చెబుతూంటారు. ఒక్క ఏపీనే కాదు.. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు.. మండిపోతున్నాయి… దాన్ని తగ్గించేందుకు కసరత్తు చేస్తున్నాం అని..నేరుగా మీడియాకు చెబుతారు. ఇంతే కాదు.. కేంద్రానికి సంబంధించిన అనేక పాలనాపరమైన అంశాల్లో మోదీ తీరు…నేరుగా తనే ప్రభుత్వ ప్రతినిధిని అన్నట్లుగా చెబుతూంటారు. ఈ విషయాన్ని మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు హైలెట్ చేశారు . అసలు ఆంధ్రప్రదేశ్ నిధులు, యుటిలిటి సర్టిఫికెట్ల గురించి అమిత్ షాకు ఎందుకని నిలదీశారు..? నువ్వేమైనా ప్రధానమంత్రివా అన్నట్లుగా ప్రశ్నించారు..?. చంద్రబాబు విమర్శలతో.. ఒక్కసారిగా అమిత్ షా వ్యవహారశైలి హాట్ టాపిక్ గా మారింది.
కేంద్రంలో ఆల్ ఇన్ వన్ నరేంద్రమోదీనే అని అందరికీ తెలుసు. మంత్రిత్వ శాఖల్లో కూడా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకునే పరిస్థితి లేదు. అన్నీ పీఎంవో డిక్టేట్ చేయాల్సింది. ఈ పీఎంవోను డిక్టేట్ చేసేది… నరేంద్రమోదీ కాదు.. అమిత్ షా అన్న అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. సీబీఐ, ఈడీ వంటి కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల్ని రాజకీయంగా వాడుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ పీఎంవో నుంచి.. అమిత్ షా నే ఈ మొత్తం వ్యవహారాలను.. సెట్ చేస్తారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో స్థానిక నేతల నుంచి వచ్చిన సమాచారం మేరకు.. ఎప్పటికప్పుడు ఐటీ దాడులు చేయించడంలో.. అమిత్ షాదే కీలక పాత్ర. అంతే కాదు… కొంత మంది ప్రాంతీయ పార్టీల నేతల్ని కేసుల పేరుతో గుప్పిట పట్టింది కూడా..పీఎంవో నుంచేనని ప్రచారం జరుగుతోంది.
ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కేసీఆర్, తమిళనాడు సీఎం పళనిస్వామిలతో పాటు… జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. అనూహ్య రీతిలో బీజేపీకి మద్దతు దారులుగా మారిపోయారు. ఎందుకిలా మారిపోయారో ఎవరీ అర్థం కాలేదు. వారి సీక్రెట్లేవో.. బీజేపీ దగ్గర ఉన్నాయన్న అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఈ సీక్రెట్లను.. అమిత్ షా.. గుప్పిట పట్టారని… చెబుతున్నారు. విధాన నిర్ణయాలను రాజకీయాలకు వాడుకోవడంతో అమిత్ షా… తెగించేశారు. అందుకే రాజకీయ లబ్ది ఉంటుందంటేనే.. ఏ నిర్ణయం అయినా తీసుకుంటున్నారు. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా అమిత్ షాను సంప్రదించాల్సిందేనని.. ఢిల్లీ వర్గాలు బాహాటంగా చెబుతున్నాయి.
నరేంద్రమోదీ.. ప్రధానమంత్రి అయ్యాక.. కీలక పొజిషన్లన్నింటిలో.. గుజరాత్ క్యాడర్ అధికారులే నియమితులయ్యారు. వీరందరూ.. అమిత్ షా కనుసన్నల్లో నడుస్తారు. కావాల్సిన ఆదేశాలు ఇచ్చేది కూడా అమిత్ షానేన్న ప్రచారం ఉంది. బీజేపీ ఎంపీలు కూడా అదే చెబుతూంటారు. మొత్తానికి అసలు ప్రధాని మోదీ అయినా.. యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్ మాత్రం అమిత్ షా అన్న విమర్శలు జోరుగానే వినిపిస్తున్నాయి. త్వరలో ఆయన్ని రాజ్యాంగేతర శక్తి అన్న ఆశ్చర్య పోవాల్సిందేమీ లేదేమో..