కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలపై… ప్రధానమంత్రి నరేంద్రమోదీ … మంత్రులతో చర్చిస్తారు. లేకపోతే నిపుణుల కమిటీని నియమిస్తారు. అంతకు మించిన క్లిష్టమైన సమస్యలపై అయితే… విస్త్రతంగా ప్రభుత్వ, అధికార వర్గాల నుంచి అభిప్రాయాలను సేకరిస్తారు. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం మాత్రం… పూర్తిగా ఆరెస్సెస్ మీద ఆధారపడుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. విదేశీ పర్యటనల్లో బిజీగా ఉండగా… ఢిల్లీలో మాత్రం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన కీలక అంశాల్లో ఆరెస్సెస్ జోరుగా నిర్ణయాలు తీసేసుకుంటోంది. ఇదేదో ఆషామాషీగా జరగడం లేదు.
రెండు రోజుల నుంచి ఆరెస్సెస్‌కు సంబంధించిన ప్రముఖులు.. కేంద్ర ప్రభుత్వ బృందంతో విస్తృతంగా విధానపరమైన నిర్ణయాలపై చర్చలు జరుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తరపున… బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా సహా పలువురు కేంద్రమంత్రులు చర్చల్లో పాల్గొంటున్నారు. అమిత్ షా..కామన్‌గా చర్చల్లో ఉండగా.. ఆయా శాఖల మంత్రులు మాత్రం.. వారి శాఖల్లో విధానపరమైన నిర్ణయాలపై.. ఆరెస్సెస్ ఆదేశాలను అందుకోవడానికి మాత్రం హాజరవుతున్నారు. ఆరెస్సెస్ భావజాలన్ని విద్యావ్యవస్థలో చొప్పించేందుకు ఇప్పటికే కేంద్రం ప్రయత్నిస్తోందన్న ఆరోపణలున్నాయి. దానికి తగ్గట్లుగానే కొత్త విద్యావిధానంపై పూర్తి స్థాయిలో సూచనలతో కూడిన ఆదేశాలను.. ఆరెస్సెస్ ప్రతినిధులు .. కేంద్రం హెచ్ఆర్డి మినిస్టర్ జావదేకర్కు ఇచ్చారు. ఈ మంత్రి కొన్ని రోజుల క్రితం.. ప్రస్తుత విద్యావిధానం ఫెయిలయిందని… వేదాలు నేర్చుకోవడమే అన్నింటికి పరిష్కారమంటూ వ్యాఖ్యానించి కలకలం రేపారు. ఆరెస్స్ ప్రతినిధులు… ఎయిరిండియాపెట్టుబడుల ఉపసంహరణ, పెట్రోల్, డిజిల్ ధరల పెరుగులద అంశాలపైనా .. కేంద్రమంత్రులకు ఆరెస్సెస్ ఏం చేయాలో చెబుతుందట.
సాధారణంగా… ఆరెస్సెస్ నేరుగా ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోదని బీజేపీ నేతలు పదే పదే చెబుతుంటారు. కానీ ప్రస్తుతం పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. కేంద్రానికి సంబంధించిన అత్యంత కీలకమైన నిర్ణయాల విషయంలో..నేరుగా ఆరెస్సెస్ జోక్యం చేసుకుంటోంది. మంత్రులతో సమీక్షలు కూడా నిర్వహిస్తోంది. ఇటీవలి కాలంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకుంటున్న నిర్ణయాలు ఫలితాలను ఇవ్వడం లేదని.. ఆరెస్సెస్ అసంతృప్తిగా ఉందన్న ప్రచారం జరుగుతోంది. అందుకే .. మోదీని పక్కన పెట్టి… విధాన నిర్ణయాల విషయంలో సంఘ్.. కీలకంగా వ్యవహరించడం ప్రారంభించిందని భావిస్తున్నారు.
బీజేపీ వర్గాలు కూడా.. ఢిల్లీలో జరుగుతున్న ఆరెస్సెస్ సమీక్షలపై ఆసక్తితో ఉన్నాయి. ఇప్పటి వరకూ..నరేంద్రమోదీకి ఎదురులేదని అందరూ భావిస్తున్నారు. అయితే రాజకీయంగా ఆయనకు గట్టి పోటీ ప్రారంభమవడం.. అదే సమయంలో.. ఆరెస్సెస్ కూడా.. పాలనపై తీవ్ర అసంతృప్తితో నేరుగా కల్పించుకోవడంతో… ఏం జరుగుతుందో వారికి అర్థం కావడం లేదు. బీజేపీ తరపున కేంద్రంలో ప్రధానమంత్రిగా ఎవరున్నా సరే.. తమ పెత్తనం ఉండాల్సిందేనని అరెస్సెస్ పట్టుదలతో ఉంటుంది. మోదీ.. మాతృసంస్థను కూడా పట్టించుకోకుండా పాలన సాగించడం వల్లే. ఇప్పుడు నేరుగా సంఘ్.. రంగంలోకి దిగిందన్న అభిప్రాయాలు బీజేపీ నేతల్లోనే వినిపిస్తున్నాయి.