రాజకీయ వ్యూహాల్లో టీడీపీ అధినేత చంద్రబాును ఢీ కొట్టడం నేటి తరం నేతలకు సాధ్యమయ్యే పని కాదు. మూడు రోజుల మహానాడులో … వచ్చే ఎన్నికలకు చంద్రబాబు.. సింగిల్ లైనా ఎజెండాను కార్యకర్తలకు నిర్దేశించారు. అదే భారతీయ జనతాపార్టీ భుజంపై నుంచి… తుపాకీ పెట్టి.. వైసీపీ, జనసేనను షూట్ చేసేయడం. తెలుగుదేశం పార్టీని విజేతగా నిలబెట్టడం. మహానాడులో టీడీపీ సమర నినాదమే చేసింది. పూర్తిగా భారతీయ జనతాపార్టీని టార్గెట్ చేసుకుంది. భారతీయ జనతాపార్టీనే ప్రధాన ప్రత్యర్థిగా ప్రకటించింది. అసలు ఏపీలో ఉనికే లేని .. డిపాజిట్లు కూడా తెచ్చుకోలేని స్థితిలో ఉన్న బీజేపీని నెంబర్ వన్ శతృవుగా పేర్కొనడంతోనే టీడీపీ వ్యూహం ఉంది. విభజన హామీలు, ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం నమ్మక ద్రోహం చేసిందన్న విషయం నేరుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ప్రజలు ఏ మాత్రం బీజేపీని సహించే అవకాశం లేదు. అదే సందర్భంలో… బీజేపీతో సన్నిహితంగా… అటు వైసీపీ ఇటు జనసేన వ్యవహరిస్తున్నాయన్న విషయాన్ని టీడీపీ ఉద్ధృతంగానే ప్రజల్లోకి తీసుకెళ్తోంది. కేసుల మాఫీ కోసం ఇప్పటికే వైసీపీ నేరుగా బీజేపీని సపోర్ట్ చేస్తోంది. కర్ణాటక ఎన్నికల్లోనూ ఆ పార్టీకి మద్దతుగా ప్రచారం చేసింది. దీంతో ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బీజేపీ, వైసీపీ మధ్య పొత్త ఉందన్న వాతారవరణం ఏర్పడింది.
అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా.. బీజేపీపై పూర్తి సాఫ్ట్ కార్నర్ చూపిస్తున్నారు. కొన్నాళ్ల ప్రత్యేకహోదా కోసం తిరుపతి , అనంతపురం, కాకినాడల్లో సభలు పెట్టినప్పుడు.. పవన్ కల్యాణ్ ప్రసంగాలను ఎవరూ మర్చిపోలేదు. బీజేపీని, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆయన తీవ్రంగా విమర్శించారు. అప్పుడు ప్రజల్లో అంత సెంటిమెంట్ లేదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా నేరుగా హోదా కోసం రంగంలోకి దిగింది. ప్రజలంతా ప్రత్యేకహోదా పోరాటమే చేస్తున్నారు. కానీ పవన్ కల్యాణ్ మాత్రం హఠాత్తుగా.. టర్న్ తీసుకున్నారు. మొదట ప్రత్యేకహోదాను అడిగింది… తానేనంటున్నారు కానీ.. ఇప్పుడు పోరాటం విషయంలో మాత్రం సైలెంటయిపోయారు.
దీంతో… టీడీపీ మహానాడు వేదికగా… వైసీపీ, జనసేనలకు ఓటేస్తే.. బీజేపీకి ఓటేసినట్లేనన్న ప్రచారాన్ని వ్యూహాత్మకంగా ప్రజల్లోకి తీసుకెళ్తోంది. అటు చంద్రబాబు నాయుడు, ఇటు లోకేష్ సహా … ఇతర టీడీపీ నేతలందరూ… మొదటచిగా బీజేపీని విమర్శించారు. బీజేపీని సమర్థిస్తున్నాయంటూ… వైసీపీ, జనసేనలను టార్గెట్ చేశారు. మొత్తానికి ఏపీలో తాము గెలవకపోయినా.. ఎట్టి పరిస్థితుల్లోనూ చంద్రబాబును గెలవనీయబోమంటున్న బీజేపీ వ్యూహాన్ని..టీడీపీ సరైన కౌంటరే సిద్ధం చేసుకుందుని.. టీడీపీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ విషయం కరెక్టో కాదో తేలాలంటే.. మరో ఏడాది ఆగాల్సిందే.