గోపాలా గోపాల తర్వాత కాస్త ఎక్కువ గ్యాప్ ఇచ్చిన విక్టరీ వెంకటేష్ ఇకనుండి వరుసెంట సినిమాలు తీసేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ‘బాబు బంగారం’ సినిమా చేస్తున్న వెంకటేష్ ఆ తర్వాత మలయాళ దర్శకుడు జీతు జోసెఫ్ తో ఓ సినిమా చేసేందుకు చర్చలు జరుపుతున్నాడు. అయితే టాలీవుడ్ రచయితగా ఎన్నో కమర్షియల్ హిట్స్ ఇచ్చిన వక్కంతం వంశీ కూడా దర్శకుడిగా మారబోతున్నాడు.
తను తీస్తే తారక్ తోనే తీయాలంటూ దాదాపు రెండు మూడు సంవత్సరాల నుండి ఎదురుచూస్తున్న వక్కంతం వంశీ ఎట్టకేలకు ఎన్.టి.ఆర్ ను ఒప్పించాడట. అందులో కళ్యాణ్ రాం కూడా ఉండబోతున్నాడని విశ్వసనీయ సమాచారం. అయితే తారక్ ప్రస్తుతం జనతా గ్యారేజ్ సినిమా చేస్తున్నాడు. ఫిబ్రవరి నుండి ఆ సినిమా రెగ్యులర్ షూట్ జరుగనుంది. ఎన్.టి.ఆర్ సినిమా ఆలస్యమవుతుందనే కారణం చేత వక్కంతం వంశీ వెంకటేష్ తో ముందు సినిమా తీసేందుకు సిద్ధమవుతున్నాడట.
వెంకటేష్ ‘బాబు బంగారం’ ఇప్పటికే 40 శాతం షూటింగ్ కంప్లీట్ చేసుకుందట. ఆ సినిమా కంప్లీట్ అయ్యాక జీతు జోసెఫ్ కన్నా వక్కంతం వంశీకే వెంకీ ఓటేసే ఛాన్స్ ఉంది అంటున్నాయి ఫిల్మ్ సర్కిల్స్. చిరు తప్పించి నాగ్, బాలయ్య వరుసెంట క్రేజీ సినిమాలతో దూసుకుపోతుంటే తమ హీరో కాస్త వెనుక పడ్డాడని దిగులుతో ఉన్నారు వెంకీ ఫ్యాన్స్. అయితే వారిని ఖుషీ చేసేందుకే వెంకటేష్ ఇకనుండి బిజీ అవనున్నాడని తెలుస్తుంది.