రాజమౌళి సినిమా అంటే.. దాదాపుగా రామోజీ ఫిల్మ్‌సిటీలోనే షూటింగ్ చేస్తారు . బాహుబలి షూటింగ్ మొత్తం నాలుగేళ్లు సాగితే… ఆ నాలుగేళ్లూ రామోజీ ఫిల్మ్‌సిటీలోనే మకాం పెట్టారు రాజమౌళి బృందం. దానికి తగిన పబ్లిసిటీ కూడా ‘ఈనాడు’ సంస్థలు అందించాయి. అయితే ఇప్పుడు రాజమౌళి దృష్టి అల్యూమినియం ఫ్యాక్టరీకి మారింది. సినిమా వాళ్లకు బాగా అచ్చొచ్చిన లొకేషన్ అల్యూమినియం ఫ్యాక్టరీ. ఇది హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పరిసరాల్లో ఉంది. తెలుగు సినిమా క్లైమాక్స్‌లు చాలా వరకూ అల్యూమినియం ఫ్యాక్టరీ వేదిక అయ్యింది. చూడ్డానికి దట్టమైన అడవిలా ఉండే ఈ లొకేషన్ని రాజమౌళి తన తదుపరి సినిమా కోసం ఎంచుకున్నాడని తెలుస్తోంది. సాధారణంగా ఫైట్లకే పరిమితమయ్యే ఈ ఫ్యాక్టరీ ఇప్పుడు కీలకమైన సన్నివేశాలకూ వేదిక కానుంది. తర్వాతి షెడ్యూల్స్ లో కొంచం భాగం ఆర్ ఎఫ్ సీ లో జరిగే అవకాశాలు ఉన్నాయి
tఅల్యూమినియం ఫ్యాక్టరీ పరిసరాల్లో ఖాళీ స్థలం ఉంది. దాన్ని రెండేళ్ల పాటు లీజ్‌కి తీసుకుంటున్నార్ట. ఈ రెండేళ్లకు దాదాపుగా కోటి రూపాయల అద్దె చెల్లించడానికి అంగీకారం కుదిరిందని సమాచారం. ఈ స్థలంలో మల్టీస్టారర్ సినిమా కోసం ఓ భారీ సెట్‌ని నిర్మిస్తారని తెలుస్తోంది. ఈ సెట్ పూర్తయ్యాక అల్యూమినియం ఫ్యాక్టరీకే వదిలేయాలన్న ఒప్పందం కుదిరినట్టు సమాచారం. బాహుబలిలోని మాహీష్మతీ సామ్రాజ్య సృష్టికర్త అయిన సాబూ సిరిల్ ఈ సినిమా కోసం అల్యూమినియం ఫ్యాక్టరీలో భారీ సెట్‌ని రూపొందించనున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం సెట్‌కి సంబంధించిన క్యారికేచర్స్, మినీచర్స్ సిద్ధం అవుతున్నాయి. దసరా తరవాత షూటింగ్ ప్రారంభిస్తారు. ఈలోగా సెట్‌ని పూర్తి చేయాలని తెలుస్తోంది. కథా నేపథ్యం ప్రకారం దట్టమైన అటవీ ప్రాంతం కావాల్సివచ్చింది. దాన్ని కొంత వరకూ సెట్‌గా, మిగిలింది సీజీగా చూపించాలని ప్లాన్. బాహుబలి తరవాత సీజీ వర్క్‌ల జోలికి వెళ్లను అని చెప్పిన రాజమౌళికి.. ఈసారీ ఆ బాధ తప్పేట్టు కనిపించడం లేదు.