హైదరాబాద్: విజయవాడ కృష్ణలంకలో కల్తీ మద్యం తాగి ఐదుగురు చనిపోయిన కేసులో నిందితుడిగా ఉన్న కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణుకు ఎట్టకేలకు ఊరట లభించింది. విజయవాడ మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్ట్ ఇవాళ బెయిల్ మంజూరు చేసింది. విష్ణుతోపాటు ఆయన సోదరుడు శ్రీనివాస్‌కు కూడా బెయిల్ లభించింది. పూచీకత్తు కింద రు.50 వేలు చెల్లించాలని కోర్ట్ వారిద్దరినీ ఆదేశించింది. వారంలో 3 రోజులపాటు పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని సూచించింది. అలాగే విచారణ నేపథ్యంలో సిట్ బృందానికి సహకరించాలని కోర్ట్ ఇద్దరికీ తెలిపింది. విష్ణు, ఆయన సోదరుడు శ్రీనివాస్‌ను సిట్ పోలీసులు ఈ నెల 7న అరెస్ట్ చేశారు. అప్పటినుంచి బెయిల్ కోసం ప్రయత్నిస్తుండగా ఇవాళ్టికి లభించింది.