‘అర్జున్‌రెడ్డి’లో హీరో విజయ్ దేవరకొండ అయితే.. ఆ సినిమా వల్ల సుధీర్‌బాబుకి ఎలా ఛాన్స్ వచ్చిందని ఆలోచిస్తున్నారా? ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వం వహించిన ‘సమ్మోహనం’ వచ్చే వారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇందులో సుధీర్‌బాబు, అదితిరావు హైదరి జంటగా నటించారు. అయితే… హీరోగా ఫస్ట్ ఛాయస్ సుధీర్‌బాబు కాదు, విజయ్ దేవరకొండ. సాధారణంగా ఇంద్రగంటి మోహనకృష్ణ హీరోలను దృష్టిలో పెట్టుకుని కథలు రాయరు. కథ రాశాక, ఆ పాత్రకు ఎవరు సూటవుతారా? అని చూస్తారు. ‘సమ్మోహనం’ కథ రాశాక ‘పెళ్లి చూపులు’ సినిమా చూసి హీరో పాత్రకు విజయ్ దేవరకొండ అయితే బావుంటుందని అనుకున్నార్ట. ఈలోపు ‘అర్జున్‌రెడ్డి’ విడుదలై అందులో హీరోకి లార్జర్ థెన్ లైఫ్ ఇమేజ్ టైపులో విపరీతమైన పాపులారిటీ రావడంతో ఆ ఆలోచనను పక్కన పెట్టేశానని ఇంద్రగంటి తెలిపారు. అప్పుడు ‘సమ్మోహనం’లో హీరో ఛాన్స్ సుధీర్ బాబు దగ్గరకు వెళ్ళింది. ఆ విధంగా ‘అర్జున్‌రెడ్డి’ మహేశ్ బావకు హెల్ప్ చేసింది.