జనసేన అధినేత పవన్ కల్యాణ్.. ఒకే ఒక్క టాస్క్ పెట్టుకున్నారు. అదే ఉత్తరాంధ్ర వెనుకబాటు పేరుతో అక్కడి ప్రజలను రెచ్చగొట్టడం. పదే పదే కళింగాంధ్ర ఉద్యమం వస్తుందంటూ.. హెచ్చరికలు జారీ చేయడం. దానితోనే ఆయన సరిపెట్టుకోవడం లేదు. ఎక్కడికెళ్లినా.. అమరావతిలోనే లక్షల కోట్లు ధారబోస్తున్నారని… కనీసం ఉత్తరాంధ్రలో ఓ పీహెచ్‌సీకి లక్ష రూపాయలు కూడా ఇవ్వడం లేదని.. ఎంతగా.. అవాస్తవాలు చెప్పాలో అంతగా చెబుతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో పోరాటయాత్ర ప్రారంభించినప్పటి నుంచి … పవన్ ప్రచార తీరు అంతే ఉంది. నేరుగా చంద్రబాబుపై అవినీతి ఆరోపణలు చేస్తూ.. ఉత్తరాంధ్ర పూర్తిగా వెనుకబాటుకు గురయిందని.. దీనికి కారణం.. ప్రభుత్వం అభివృద్ధి అంతా ఒక్క చోటనే కేంద్రీకరించడం కారణమని కథలు కథలుగా చెబుతున్నారు.
నిజానికి ఉత్తరాంధ్ర వెనుకబడిందని అందరూ చెప్పుకోవడానికి కారణం.. అక్కడున్న ఏజెన్సీ ప్రాంతాలే. మైదాన ప్రాంతాలు కాదు. కానీ పవన్ కల్యాణ్… మొత్తం ఆ ప్రాంతం మొత్తం.. వెనక్కి నెట్టబడిందని… రెచ్చగొట్టేయడానికి ఏ మాత్రం…సంకోచించడం లేదు. బాక్సైట్ తవ్వకాలు జరగడం లేదని తెలిసి కూడా.. వేల కోట్ల బాక్సైట్ తరలించుకెళ్తున్నారని చెప్పుకొచ్చారు. బాక్సైట్ తవ్వకాలకు ఇచ్చిన అనుమతులు రద్దు చేయడంతో.. వైఎస్ కుటుంబ సన్నిహితుడు ప్రతాప్ రెడ్డికి చెందిన “అన్‌రాక్” సంస్థ దివాల్ పిటిషన్ కూడా వేసింది. ఇదే కాదు.. పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్రలో చెప్పిన ప్రతి ఒక్కటి అబద్దమేనని టీడీపీ నేతలు బహిరంగంగానే సవాల్ చేశారు. ఆధారాలుంటే నిరూపించాలన్నారు. కానీ పవన్ కల్యాణ్ ఒక్కరంటే.. ఒక్కరికి కూడా సమాధానం ఇవ్వలేదు. చివరికి ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే సంస్థకు ఇచ్చిన భూముల విషయంలోనూ అవాస్తవాలే ప్రచారం చేశారు.
ఇలా ఉత్తరాంధ్ర వెనుకబడిపోయిందని.. ఇతర ప్రాంతాలతో పోల్చి.. ప్రజలను రెచ్చగొట్టడంతోనే పవన్ కల్యాణ్ సరిపెట్టుకోవడం లేదు. మేధావులతో సమావేశాలు దీన్ని మరింత రసవత్తరంగా నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధావులతో సమావేశాల్లో… చేసేది కూడా.. ఇతర ప్రాంతాలతో.. అంటే అమరావతితోనే..మరో ప్రాంతంతోనే పోల్చి… ఉత్తరాంధ్రను అన్యాయం చేస్తున్నారని.. కళింగాంధ్రనే దిక్కు అని ఆయన ఓ రిపోర్ట్ ప్రకటించే అవకాశాలున్నట్లు .. తెలుగుదేశం పార్టీ వర్గాలు అనుమానిస్తున్నాయి. రాయలసీమలో బీజేపీ, వైసీపీ కలసి ప్రాంతీయ వాదం
రెచ్చగొడుతున్నాయని… ఉత్తరాంధ్రను ఆ బాధ్యతను బీజేపీ పవన్ కల్యాణ్‌కు ఇచ్చింది టీడీపీ అనుమానిస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయాన్ని నవనిర్మాణ దీక్షల్లో పదే పదె చెబుతున్నారు. ఆ తరహాలోనే పవన్ కల్యాణ్ కార్యాచరణ ఉంటోంది. అంటే పవన్ కల్యాణ్ కాబోయే కళింగాంధ్ర ఉద్యమ నాయకుడు కావొచ్చు..!
——సుభాష్