చిరంజీవి ఇంటి నుంచి మరో హీరో వస్తున్నాడంటే.. ఆటో మెటిగ్గా దృష్టి అటువైపుకు మళ్లుతుంది. ఏం చేస్తాడో, ఎలా చేస్తాడో అనే ఆసక్తి ఉంటుంది. చిరంజీవి ఇంటి నుంచి వచ్చిన ప్రతీ హీరోనీ అదే దృష్టితో చూశారు జనాలు. ఇప్పుడు చిరు అల్లుడు వచ్చాడు. కల్యాణ్‌దేవ్ కథానాయకుడిగా ఎంట్రీ ఇస్తూ.. `విజేత`ని రూపొందించింది వారాహి చలన చిత్రం సంస్థ. ఫస్ట్ లుక్ వరకూ ఓకే అనిపించుకున్న కల్యాణ్… టీజర్లోనూ పాస్ మార్కులు వేయించుకున్నాడు. చిరంజీవి అల్లుడు కదా, ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు కదా.. అని ఏవేవో చేయించకుండా – కథకేం కావాలో అనుసరిస్తూ.. అదే చూపించారు. కల్యాణ్ దేవ్ లుక్ బాగుంది. డబ్బింగ్ పరంగా చూస్తే వాయిస్ బాగుంది. ఇక ఫైట్లూ, డాన్సులు ఎలా చేస్తాడో చూపించలేదు. ఇదో తండ్రీ కొడుకుల కథ.. కథలో ఏం చెప్పబోతున్నారో అదే చూపించారు. ఈ విషయంలో దర్శక నిర్మాతల్ని మెచ్చుకోవాల్సిందే. ఇక డాన్సులు, ఫైటింగుల విషయంలోనూ తన స్టైల్ చూపించగలిగితే.. కల్యాణ్దేవ్కి మరి కొన్ని అవకాశాలు రావడం ఖాయం.