బేసిగ్గా సినీ నేపధ్యం వుంటే చాలు ఇండస్ట్రీలో నెగ్గుకు రావచ్చు అనే అభిప్రాయం ఉటుంది. కానీ అది ఒక్కటే సరిపోదు ఇక్కడ నిలబడాలంటే ప్రతిభ ఉండాల్సిందే అని గోపిచంద్ ని చూస్తే అర్ధం ఉటుంది. గోపీచంద్ ది సినీ నేపధ్యం వున్న కుటుంబమే. తండ్రి టి. కృష్ణ సినీ దర్శకుడు. అయితే గోపి సినిమాలకు రాకముందే ఆయన మరణించారు. రష్యాలో ఇంజనీరింగ్ చదువుకున్న గోపి సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాడు. అయితే ఆయన ప్రయాణం ఏమంత సులువుగా సాగలేదు. “తొలివలపు” చిత్రం ద్వారా హీరో పరిచమైన గోపిచంద్ కు ఆ సినిమా చాలా పెద్ద నిరాశను మిగిల్చింది. ఎంతలా అంటే మరో సినిమా ఆయన దగ్గరికి వెళ్ళలేదు.
అయితే నిరాశ పడిపోలేదు గోపి. విలన్ గా టర్న్ తీసుకున్నారు. ఆ వరుసలో వచ్చిన ‘జయం’ సినిమా ఆయనకు సెకెండ్ ఇన్నింగ్ ను ఇచ్చింది. ఆ తర్వాత నిజం, వర్షం చిత్రాలతో తనకంటూ ఓ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నారు గోపి. అదే క్రేజ్ తో ‘యజ్ఞం’తో మళ్లీ హీరో గా కనిపించారు. ఈ సినిమా హిట్. ప్రేక్షకులు గోపిని మాస్ హీరోగా అంగీకరించారు. అక్కడితో మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు గోపి. మాస్ హీరోగా మంచి విజయాలు అందుకున్నారు. మధ్యలో అపజయాలు ఎదురైన మళ్లీ పుంజుకున్నారు. మళ్ళీ లౌక్యం, జిల్, గౌతమ్ నంద చిత్రాలత సూపర్ ఫాల్ లోకి వచ్చిన గోపికి ఇప్పుడు ‘పంతం’ అంటూ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. అన్నట్టు.. ఈ రోజు గోపీచంద్ పుట్టిన రోజు. ఈ సందర్భం ఆయనకు ఆల్ ది బెస్ట్ చెబుతూ.. జన్మదిన శుభాకాంక్షలు అందిస్తుంది తెలుగు 360.com.