sudheer babu sammohanam interview
యూత్ ఫుల్ సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు సుధీర్ బాబు. స్వచ్ఛమైన వినోదాల్ని పంచే దర్శకుడిగా ముద్ర వేసుకున్నారు మోహనకృష్ణ ఇంద్రగంటి. ఇప్పుడు వీరిద్దరూ కలసి సమ్మోహనం అనే సినిమా చేశారు. అదితి రావు హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా తెలుగు 360.కామ్ తో ముచ్చటించారు సుధీర్. ఆ ముచ్చట్లు….
సమ్మోహనం కథ ఎప్పుడు విన్నారు ?
మోహనకృష్ణ ఇంద్రగంటి నాకు ఎప్పటి నుండో తెలుసు., నా మొదటి సినిమా ‘ఎస్.ఎమ్.ఎస్’ తర్వాత ఆయన నన్ను కకలిసి ఒక కథ చెప్పారు. కొని కారణాల వల్ల అది ఆగిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఆయన నాకు ఓ కథను నేరేట్ చేశారు. విన్న వెంటనే మరో ఆలోచన లేకుండా ఓకే చెప్పాను.
సమ్మోహనం ఎలా వుంటుంది ?
చెప్ప నిజజీవితాలకు ఈ సినిమా అద్దం పడుతుంది. హీరో హీరోయిన్స్ మధ్య ఉండే సంభాషణలు, రొమాన్స్, వినోదం అన్ని రియలిస్టిక్‌గా ఉంటాయి. గతంలో కొన్ని నేను లవ్‌స్టోరీస్ చేశాను. వాటికి భిన్నంగా ఈ సినిమా సాగుతుంది. నాకు ఓ ఛాలెంజింగ్‌గా అనిపించింది. సినిమాటిక్ అనుభూతితో కాకుండా యథార్థ జీవితాల్ని కళ్లముందు చూస్తున్న అనుభూతి కలుగుతుంది.
ట్రైలర్ చూస్తే ఈ సినిమా సినిమా ఇండస్ట్రీ చుట్టూ తిరుగుతుందని అనిపిస్తుంది.. దీని నేపధ్యం ఏమిటి?
నిజమే.. ఈ సినిమా ఇండస్ట్రీపై వున్న కొన్ని అపోహలను తొలగిస్తుంది. సినిమా రంగం పట్ల కొంత మందిలో ఉండే అభిప్రాయాల్ని వారి ఐడియాలజీని నా పాత్ర ప్రతిబింబిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో చూపించేదంతా నిజాలు కావు. తెరమీదతో పోలిస్తే నిజజీవితంలో తారలు విభిన్నంగా ఉంటారు. కెమెరా ముందు వస్తే మరోలా మాట్లాడుతుంటారని చాలా మంది అపోహపడుతుంటారు. అలాంటి సందేహాలన్నీ కొంతైనా ఈ సినిమా నివృత్తి చేస్తుంది.
సినిమాలో మీ పాత్ర గురించి ..
ఇది నాకు చాలా కొత్త పాత్ర. ఇందులో చిల్ర్డన్ బుక్ ఇల్లస్ట్రేటర్‌గా పనిచేస్తుంటాను. కళాకారుడిగా గొప్ప పేరు తెచ్చుకోవాలన్నది అతడి లక్ష్యం. సినిమాలు, ఆ ప్రపంచం అంటే నచ్చదు. అదితిరావ్ హైదరీ ఓ స్టార్‌గా కనిపిస్తుంది. భిన్న రంగాలు, మనస్తత్వాలు కలిగిన వారి మధ్య పరిచయం ఎలాంటి పరిణామాలకు దారితీసిందన్నదే ఈ చిత్ర ఇతివృత్తం. మా ఇద్దరి కాంబినేషన్లో వచ్చే ప్రతి సన్నివేశం అలరిస్తుంది. ఫన్‌తో పాటు అందమైన ప్రేమకథ మిళితమై ఉంటుంది.
మోహన్ కృష్ణగారి దర్శకత్వ శైలి గురించి చెప్పండి
దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటితో గతంలో ఓ సినిమా చేయాల్సింది. కానీ కుదరలేదు. ఆ అవకాశం అప్పుడు చేజారిన మళ్లీ ‘సమ్మోహనం’ ద్వారా కుదరడం ఆనందంగా ఉంది. గతంలో చేసిన సినిమాల విషయంలో ఫలానా సన్నివేశం ఇంకా బాగా చేసుండాల్సిందని అనుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. మోహన్ కృష్ణ చాలా క్లారిటీ వున్న దర్శకుడు. ఆయనకి ఏం కావాలో బాగా తెలుసు. కన్ఫ్యూజన్ ఉండదు. ఆర్టిస్ట్ ని కంఫర్ట్ బుల్ గా ఉంచుతారు. ఆయనలో ఏ మాత్రం ఒత్తిడి కనిపించదు. కెప్టెన్ స్ట్రాంగ్ గా వున్నపుడు టీం అంత కాన్ఫిడెంట్ గా ఆడుతుంది. మేము కూడా ఈ సినిమా అంత కాన్ఫిడెంట్ చేశాం. ప్రతి నటుడు మోహన కృష్ణ గారితో ఒక్కసారైన పనిచేయాలి.
ప్రీ రిలీజ్ వేడుకలో చాలా ఎమోషనల్ అయ్యారు ?
ఇప్పటి వరకు ఎక్కువగా కొత్త దర్శకులతోనే సినిమాలు చేశాను. అనుభవజ్ఞుడైన దర్శకుడితో పనిచేయడం ఇదే తొలిసారి. నా ప్రతిభను నమ్మి మోహనకృష్ణ అవకాశమివ్వడం, నేనె తన బెస్ట్ హీరోనని చెప్పడంతో కొంత ఎమోషనల్ అయ్యాను. అచీవ్లా ఫీలయ్యాను.
ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్‌బాబు మహేష్ సుధీర్ సహాయాన్ని అడగలేదన్నారు? దాని గురించి..
నాకంటూ సొంతంగా ఏదైనా సాధించాలనే ఆలోచనతో సినిమా ఇండస్ర్టీలోకి వచ్చాను. మా నాన్నగారికి చాలా వ్యాపారాలు ఉన్నాయి. వాటిని చూసుకునే బాధ్యతల్ని చేపడుతానంటే ఆయన కాదరను. సంతృప్తి కోసమే నాకు నచ్చిన నటనను ఎంచుకున్నాను. ఇక్కడ కూడా ఇతరుల పేర్లు చెప్పుకుంటూ వారి ద్వారా అవకాశాలు పొందుతూ బతికితే గౌరవం ఉండదు. చిన్నతనం నుంచి నాకు స్వతంత్రభావాలు ఎక్కువ. అలాగే జీవించాలని కోరుకుంటాను.
నిర్మాణ ఆలోచన రావడానికి కారణం ?
సినిమా అంటే మక్కువ తో చాలా మంది ఇక్కడి వస్తారు. నటులు దర్శకులనే కాకుండా కొరియోగ్రాఫర్స్, ఫైట్‌మాస్టర్స్, నటీనటులు ఇలా చాలా మంది ప్రతిభ ఉండి సరైనా ప్రోత్సాహం లేక తిరిగి వెళ్లిపోయినవారున్నారు. అలాంటి కొత్తవారిని గుర్తించి అవకాశలివ్వాలనే ఆలోచనతో నిర్మాణ సంస్థను ప్రారంభించాను. ఈ సంస్థలో తొలి ప్రయత్నంగా ఆర్.ఎస్. నాయుడు అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఓ సినిమా చేస్తున్నాను.
మహేష్ వంశీ పైడిపల్లి సినిమాలో మీకు ఒక రోల్ ఉందని వార్తలు వస్తున్నాయి ?
లేదు. కానీ మహేష్ తో ఎప్పుడైన ఒక సినిమా చేస్తా. సరైన కథ దొరకాలి.
పుల్లెల గోపీచంద్ బయోపిక్ ఎప్పుడు?
సెప్టెంబర్‌లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించనున్నాం. హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
ఓకే.. ఆల్ ది బెస్ట్
థ్యాంక్యూ