తమిళ దర్శకుడు లింగుస్వామీ తో ఓ సినిమా కమిట్ అయ్యాడు అల్లు అర్జున్. అట్టహాసంగా ఈ సినిమాకి కొబ్బరికాయ్ కూడా కొట్టారు. కీర్తి సురేష్ ని హీరోయిన్ అనుకున్నారు. సరైనోడు తర్వాత ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్ళాలి. కానీ ఎందుకో కుదరలేదు. అయితే డిజే తర్వాత మొదలౌతుందని అంతా అనుకున్నారు. కానీ బన్నీ ఆ దిశగా వెళ్ళలేదు. నా పేరు సూర్య చేశాడు. ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ నుండి ఇంకా ఏ సినిమాపై అధికారిక ప్రకటన రానప్పటికీ బన్నీ ముగ్గురు దర్శకుల దగ్గర మాట తీసుకున్నాడని తెలిసింది.
మొదట విక్రమ్ కే కుమార్ తో ఓ సినిమా చేక్నున్నాడు బన్నీ. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ తో హ్యాట్రిక్ సినిమా వుంటుంది. అరవింద సమేత పూర్తవ్వగానే బన్నీ సినిమా స్క్రిప్ట్ మొదలుపెట్టనున్నారు త్రివిక్రమ్. ఈ సినిమా తర్వాత సురేందర్ రెడ్డితో ఓ సినిమాకి కమిట్ అయ్యాడు బన్నీ. సైరా తర్వాత సూరి సినిమా బన్నీతోనే వుంటుందని తెలిసింది. సో.. బన్నీ వరుస చూస్తుంటే లింగుస్వామి సినిమా ఇక లేనట్లే కనిపిస్తుంది.