కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శాసనసభ్యత్వాల రద్దు విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్‌కు చిక్కులు ప్రారంభమయ్యాయి. గవర్నర్ ప్రసంగం రోజే… మండలి చైర్మన్‌ను గాయపరిచారంటూ… కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్‌కుమార్ సభ్యత్వాల్ని రద్దు చేస్తూ స్పీకర్ నిర్ణయం తీసుకున్నారు. వెంటనే గెజిట్ నోటిఫికేషన్ ప్రకటించారు. ఫలితంగా వాళ్లకు రాజ్యసభ ఎన్నికల్లో ఓటేయడానికి కూడా అవకాశం దొరకలేదు. ఆ తర్వాత వాళ్లు స్పీకర్ నిర్ణయంపై కోర్టుకెళ్లారు. కోర్టు… స్పీకర్ నిర్ణయాన్ని కొట్టేసింది. స్పీకర్ సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా నిర్ణయం తీసుకున్నారని హైకోర్టు స్పష్టం చేసింది. ఇది ప్రభుత్వానికి ముఖ్యంగా సీఎం కేసీఆర్‌కు ఇబ్బందికర పరిణామంగా మారింది.
కోర్టు తీర్పును శివసావహిస్తే… శానన వ్యవస్థలో… న్యాయవ్యవస్థ జోక్యాన్ని అంగీకరించినట్లు అవుతుంది. ఇది ఒక్క తెలంగాణ సమస్య కాదు. ఈ తీర్పును…దాన్ని పరిగణనలోకి తీసుకున్న తెలంగాణ అసెంబ్లీని ప్రామాణికంగా తీసుకుని మరింతగా…శానసన వ్యవస్థలోకి న్యాయవస్థ జోక్యం చేసుకునే ప్రమాదం ఉంది. అలా అని కేసీఆర్.. కోర్టు తీర్పును తోసి పుచ్చడానికి కూడా సిద్ధపడటం లేదు. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం పెట్టి… అసెంబ్లీలో ఏం జరిగినా.. అంతా సభ పరిధిలోనే ఉంటుందని.. హైకోర్టుకు అధికారాలు లేవని చెప్పి… తీర్పును తిరస్కరిస్తున్నట్లు తీర్మానం చేస్తే.. ఇక కోమటిరెడ్డి, సంపత్‌లకు అవకాశం ఉండదు. కానీ కేసీఆర్ ఇలా చేయడానికి కూడా ఆలోచిస్తున్నారు. ఇది నేరుగా న్యాయవ్యవస్థతో ఘర్షణ పడినట్లు అవుతుంది. ఇది కేసీఆర్‌కు ఇష్టంలేదు. సంబంధం లేకుండా… ఎమ్మెల్యేలతో పిటిషన్లు వేయించారు. ఈ పిటిషన్‌ను కోర్టు కొట్టి వేసింది.
ఇంత జరిగినా అనర్హతా వేటు వేసిన వారిని ఎమ్మెల్యేలుగా గుర్తించలేదు. కోర్టు తీర్పుపై ఎలాంటి భావాన్ని స్పీకర్ వ్యక్తం చేయడం లేదు. ప్రభుత్వం కూడా సైలెంట్‌గానే ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీ .. టీఆర్ఎస్పై ఒత్తిడి పెంచేందుకు… మళ్లీ హైకోర్టుకు వెళ్లింది. కోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయడం లేదని ధిక్కార పిటిషన్ వేసింది. దీంతో అసెంబ్లీ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ఇక దీనిపై వాదోపవాదాలు జరుగుతాయి. కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరికే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి కేసులు సహజంగా…కోర్టుల్లోనే నలిగిపోతూంటాయి. అలా అయిపోవాలనే.. తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తున్నట్లు భావిస్తున్నారు. ఇలా ముగియడమే.. మంచిదన్న భావనలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది. లేకపోతే… ఏ వైపు అడుగేసినా చిక్కులొస్తాయన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నట్లు తెలుస్తోంది.