‘సమ్మోహనం’లో దర్శకుడిగా కంటే రచయితగా మంచి మార్కులు వేసుకున్నాడు ఇంద్రగంటి మోహనకృష్ణ. నటీనటుల పరంగా అతిథిరావు హైదరి ఓకే అనిపించుకుంటే నరేష్ విజృంభించాడు. సంగీతం కూడా కూల్‌గా ఉంది. వీటితో పాటు కళా దర్శకుడి ప్రతిభ కూడా బయటపడింది. చిన్న సినిమాకి ఆర్ట్ వర్క్ తో అంతగా పని ఉండదనుకుంటాం. కానీ ఈ సినిమా చూస్తే మాత్రం అలా అనిపించలేదు. ముఖ్యంగా హీరో ఇల్లుని అందంగా తీర్చిదిద్దారు ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్. నిజానికి అది కూడా సెట్టే. ‘నిజంగా ఇంత అందమైన ఇల్లు ఉందా’ అంటూ భ్రమించేలా ఇంటీరియర్ డిజైన్ చేశారు. టెర్రస్‌పై సీన్ ఈ సినిమాకి హైలెట్. దాన్ని కూడా సెట్ వర్క్‌తోనే తీర్చిదిద్దారు. చుట్టూ రకరకాల పూల మొక్కలతో, మంచి కలర్ కాంబినేషన్‌తో ‘ఆహా’ అనిపించారు. నిజంగా ఓ ఇంటి మేడ మీద సీన్ జరుగుతున్నట్టు భ్రమించారు. హీరో, హీరోయిన్ల కాస్ట్యూమ్స్ కూల్‌గా ఉన్నాయంటే అదీ రవీందర్ మహత్తే. మగధీర, ఈగ, అత్తారింటికి దారేది, భాగమతి… ఇలా భారీ చిత్రాలకు పనిచేసే రవీందర్.. అప్పుడప్పుడూ తన టేస్ట్ కి తగ్గట్టుగా రూపొందుతున్న చిన్న సినిమాలకూ తన వంతు సాయం అందిస్తున్నాడు. అన్నట్టు ‘అమీ తుమీ’లో కూడా కళా పనితనం క్లాస్‌గా కనిపించింది. దానికీ … రవీందరే ప్రొడక్షన్ డిజైనర్.