ఇన్‌స్టాగ్రామ్‌లో యంగ్ టైగర్ ఎంట్రీ అదిరిందంతే. ఇద్దరబ్బాయిలతో కలిసి ఇన్‌స్టాలో అడుగు పెట్టారాయన. అదీ తనయులను ఆయన ఫొటో తీస్తున్న ఫొటోని పోస్ట్ చేశారు. ఇటీవల ఎన్టీఆర్ సతీమణి ప్రణతి మగబిడ్డకు జన్మను ఇచ్చిన సంగతి తెలిసిందే. అతణ్ణి ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులకు, ప్రేక్షకులకు పరిచయం చేశారు. అయితే… చిన్నారి ఫేస్ పూర్తిగా కనిపించడం లేదు. ఇంకా పేరు పెట్టని చిన్నారిని ఎన్టీఆర్ మొదటి కుమారుడు అభయ్‌రామ్ తన చేతుల్లో మురిపెంగా పట్టుకోగా… ఎన్టీఆర్ ఫొటో తీస్తున్న సమయంలో, ఆయన వెనుక వున్న ప్రణతి ఈ ముగ్గురినీ ఫొటో తీశారు. ఆ ఫొటోయే మీరు చూస్తున్నది.