`సైరా` విషయంలో చిరంజీవి ఆలోచనలు మారుతున్నాయి. నిన్నా మొన్నటి వరకూ `స్లో అండ్ స్టడీ` అన్న థీరీలోనే సాగింది సైరా షూటింగ్. అయితే ఇప్పుడు చిరు మాత్రం `వేగం పెంచాల్సిందే` అంటున్నాడట. `షెడ్యూల్స్ మారినా ఫర్వాలేదు… టైమ్ తీసుకోండి. క్వాలిటీలో రాజీ పడొద్దు` అని టీమ్‌కి చెబుతూ వచ్చిన చిరు.. ఇప్పుడు మాట మార్చినట్టు తెలుస్తోంది. `వీలైనంత వేగంగా ఈ సినిమా పూర్తవ్వాలి` అంటూ అల్టిమేట్టం జారీ చేశాడట. దానికి కారణం.. కొరటాల శివనే. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా మొదలవ్వబోతున్న సంగతి తెలిసిందే. `సైరా ` తరవాత చిరు చేయబోయే సినిమా ఇదే. ఈయేడాది చివరి నాటికి కొరటాల శివ సెట్స్‌పైకి వెళ్లాలన్నది చిరు ధ్యేయం. `సైరా` విడుదల సమయానిఇ కొరటాల షూటింగ్ కనీసం 30 శాతం అవ్వాలని భావిస్తున్నాడట. అందుకు తగ్గట్టుగా షెడ్యూల్స్ ప్లాన్ చేసుకోవాలని చిరు సూచించాడని టాక్. షూటింగ్ కోసం టైమ్ తీసుకోవద్దని, అవసరమైతే విజువల్ ఎఫెక్ట్స్ కోసం టైమ్ కేటాయించమని చెబుతున్నాడట. అందుకే… సురేందర్ రెడ్డి అండ్ టీమ్ ఆఘమేఘాల మీద పనులు పూర్తి చేస్తున్నార్ట. ఈ ఎఫెక్ట్ క్వాలిటీపైనా పడే ప్రమాదం ఉందని సాంకేతిక నిపుణులు భావిస్తున్నారని తెలుస్తోంది. మరి సురేందర్ రెడ్డి ఎలా మేనేజ్ చేస్తాడో?