‘బిగ్ బాస్’ రియాలిటీ షోలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకరింగ్ మిస్ అవుతున్నామని బాధ పడుతోన్న అభిమానులకు చిన్న శుభవార్త. త్వరలో బుల్లితెరపై సందడి చేయనున్నాడీ హీరో. అయితే… యాంకర్ గా కాదు, అతిథిగా! పది సీజన్లుగా సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న డాన్స్ రియాలిటీ షో ‘ఢీ’. ఈటీవీలో ప్రసారం అవుతోన్న ఈ షోకి మల్లెమాల ఎంటర్టైన్మెంట్స్ ప్రొడ్యూసర్. కొన్ని నెలలుగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని అందిస్తూ, డాన్స్ ప్రియులను అలరిస్తున్న ‘ఢీ 10’ చివరకు వచ్చింది. త్వరలో ఫైనల్స్ టెలికాస్ట్ కానున్నాయి. ప్రస్తుతం ఆ ‘ఢీ10’ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతోంది. దీనికి ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా అటెండ్ అయ్యాడు. డాన్సుల్లో ఎన్టీఆర్ స్పీడ్, స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. యంగ్ డాన్సర్లను ఎంకరేజ్ చేయడం కోసం ఆయన రావడం మంచి పరిణామం. ‘బిగ్ బాస్-2’లో ఎన్టీఆర్ యాంకరింగ్ మిస్ అవుతున్నామని అనుకునేవాళ్లు ‘ఢీ10’ ఫినాలేలో చూసి కాస్త సంతోషపడతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు