ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు .. రాజకీయ ప్రత్యర్థులు ఎంత రెచ్చగొట్టినా… తన సహనాన్ని మాత్రం కోల్పోరు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆయన భావోద్వేగాలు బయటపెట్టుకోరు. కానీ సోమవారం.. వెగలపూడి సెక్రటేరియట్లో నాయిబ్రాహ్మణులు చేస్తున్న ఆందోళనలో మాత్రం… ఆయన తన సహనాన్ని కోల్పోయారు. ఎంత చెప్పే ప్రయత్నం చేసినా నాయీ బ్రాహ్మణులు వినించుకోకపోవడం… వారిలో కొంత మంది అనవసర వ్యాఖ్యలు చేయడంతో చంద్రబాబు సహనం కోల్పోయారు. సమస్యను పరిష్కరించుకునే విధానం ఇది కాదని… మండిపడ్డారు. ఉద్యోగులు కాకుండా… ఉద్యోగుల్లా… కనీస వేతనం ఇవ్వడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఇష్టం ఉంటే పని చేసుకోండి.. లేకపోతే లేదని తేల్చి చెప్పేశారు.
నాయీబ్రాహ్మణులు అంతకు ముందు ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో చర్చలు జరిపారు. అక్కడ కూడా.. ఉద్యోగుల్లా కనీస వేతనం ఇవ్వడం సాధ్యం కాదని.. టిక్కెట్ డబ్బులు రూ. 25 రూపాయలు ఇచ్చేందుకు సిద్ధమేనని తెలిపారు. కానీ నాయీబ్రాహ్మణులు మాత్రం ఉద్యోగులగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబు ఆగ్రహంతో… సచివాలయంలో కాసేపు టెన్షన్ వాతారవణం ఏర్పడింది. ఇలాంటి ఘటన ఏదైనా జరిగితే… దానికి మరిన్ని ఎఫెక్ట్లు జోడించి.. నడిపించే సాక్షి ఈ విషయంలో కూడా వెనక్కి తగ్గలేదు. చంద్రబాబు నాయీబ్రాహ్మణులపై రుబాబు చేశారని… గంటల కొద్దీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. తెలంగాణకు చెందిన నాయీబ్రాహ్మణుల అభిప్రాయాలను కూడా తెలుసుకుంది. ప్రముఖంగా ప్రసారం చేసింది.
మొత్తానికి ఈ వ్యవహారానికి కులం రంగు పులమడంలో సాక్షి సక్సెస్ అయింది. ఆ సమస్య కేవలం ఆలయాల్లో పని చేసే క్షురకుల వ్యవహారం కాకుండా.. దాన్ని నాయీ బ్రాహ్మణుల సమస్యగా మార్చే ప్రయత్నం చేసింది. ఈ విషయంలో రాజకీయంగా బురద జల్లేందుకు కావాల్సినంత మెటీరియల్ సాక్షి దగ్గర రెడీగా ఉంటుంది. ఇప్పటికే వివిధ కులాల పెద్దల్ని రంగంలోకి దింపి.. నానా రచ్చ చేసిన… వైసీపీ నేతలు.. దీన్ని మాత్రం ఎందుకు వదులుకుంటారు…? రకరకాలుగా నాయీబ్రాహ్మణ నేతలు సాక్షి తెర మీదకు వచ్చి… చంద్రబాబు, టీడీపీని విమర్శించడాన్ని నాలుగైదు రోజుల పాటు సీరియల్‌గా మనం చూడాల్సి రావొచ్చు.