సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకుపోతున్న నటుడు నరేష్. ఆయనకు వరుసగా అన్నీ హిట్లే. శతమానం భవతి, రంగస్థలం, మహానటి, సమ్మోహనం… ఇలా మంచి మంచి పాత్రలు దక్కుతున్నాయి. త్వరలోనే మరో కొత్త పాత్రలోకి ప్రవేశించబోతున్నారాయన. కథకుడిగా కొత్త అవతారం ఎత్తబోతున్నారు. నరేష్‌లో మనకు తెలియని కోణం మరోటి ఉంది. ఆయన కథలు రాస్తుంటారట. ఈమధ్య రాసిన కథ సినిమాగా పనికొస్తుందనిపించి ఓ దర్శకుడికి వినిపించారట. అది ఆ యువ దర్శకుడికి బాగా నచ్చిందని, నరేష్ చేతిలో అడ్వాన్సు పెట్టేసి, కథని తీసేసుకున్నారని తెలుస్తోంది. త్వరలోనే నరేష్ కథని సినిమాగా చూడొచ్చన్నమాట. ప్రస్తుతం నరేష్ నటించిన ‘సమ్మోహనం’ మంచి టాక్‌తో దూసుకుపోతోంది. ఇందులో సర్వేష్‌గా నవ్వించాడు నరేష్. సమ్మోహనం విజయంలో.. నరేష్ దీ కీలకపాత్రే. ఈ సినిమాతో తన కెరీర్లో మరో టర్నింగ్ పాయింట్ దొరికిందని పొంగిపోతున్నాడు నరేష్. ”ఈ సినిమాతో చాలా మంచి అప్లాజ్ వచ్చింది. అదంతా ఇంద్రగంటి మోహన కృష్ణ మ్యాజిక్. సినిమా నేపథ్యంలో వచ్చిన సినిమాలేవీ సరిగా ఆడలేదు. కానీ.. సమ్మెహనం మాత్రం నిలబడింది. నా పాత్రకూ మంచి పేరొచ్చింది. సెకండ్ ఇన్నింగ్స్ లో నేను చేసిన మరచిపోలేని పాత్రల్లో ఇదొకటి” అంటున్నారు నరేష్.