ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. ఇందులో మెగా బ్రదర్ నాగబాబు ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. నందమూరి సినిమాల్లో మెగా కుటుంబానికి చెందిన నటుడు కనిపించడం బహుశా ఈమధ్య కాలంలో ఇదే కావొచ్చు. ఇంతకీ ఈ సినిమాలో నాగబాబు చేస్తున్న పాత్ర ఏమిటో తెలుసా? ఆయనో ఫ్యాక్షన్ లీడర్. `అరవింద సమేత` ఓ ఫ్యాక్షన్ స్టోరీ. రాయల సీమ నేపథ్యంలో సాగుతుంది. అలాంటప్పుడు ఫ్యాక్షన్ గొడవలు, లీడర్లూ ఉండాలి కదా? నాగబాబు ఓ ఫ్యాక్షన్ లీడర్‌గా కనిపిస్తాడట. క్యారెక్టర్ ఆర్టిస్టుగా బిజీ అయ్యాక… నాన్న, బాబాయ్, పోలీస్ ఆఫీసర్ లాంటి పాత్రలు చేస్తూ వస్తున్నాడు నాగబాబు. కానీ సీరియస్ పాత్రలు పడడం లేదు. ఈసారి త్రివిక్రమ్ ఆ లోటు తీర్చాడనిపిస్తోంది. నాగబాబు పాత్ర సీరియస్ గా ఉంటూ… కావల్సినన్ని పంచ్‌లు వేస్తుంటుందట. ఎంతైనా త్రివిక్రమ్ సినిమా కదా.. పంచ్‌లు పడకపోతే ఎలా? అయితే నాగబాబుకి మాత్రం ఇది కొత్త అనుభవం. జబర్ దస్త్‌లో కూర్చున్న సీట్లోంచి కదలకుండానే నవ్వుతూ సెటిలైపోయే నాగబాబు వైట్ అండ్ వైట్ డ్రస్సులో కత్తి పట్టుకున్న పాత్రలో ఎలా సెటిలైపోతాడో మరి.