తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ప్రధాన అర్చకులు రమణదీక్షితులు అన్యమతస్తులతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఆయన ఇప్పుడు క్రిస్టియన్ చారిటీ సంస్థల సహకారంతోనే … టీటీడీపై, ప్రభుత్వం ఆరోపణలు చేస్తున్నారు. కొద్ది రోజుల విరామం తర్వాత.. మరోసారి టీటీడీపై ఆరోపణలు చేయడానికి హైదరాబాద్ లో ప్రెస్మీట్ ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశాన్ని బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి ఆర్గనైజ్ చేశారు. ఈ బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి క్రిస్టియన్ చారిటీ సంస్థను నిర్వహిస్తున్నారు. సైమన్ అమృత్ ఫౌండేష్ పేరుతో..మత ప్రచార కార్యక్రమాలలను నిర్వహిస్తున్నారు. గుంటూరుకు చెందిన ఇతను.. సైమన్ అమృత్ ఫౌండేషన్ సంస్థకు సీఈవో, ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు.
ఈ బోరుగడ్డ అనిల్ కు … నేర చరిత్ర కూడా ఉంది. గతంలో అమరావతి ప్రాంతంలో… భూదందాలు నిర్వహిస్తూ పోలీసులకు చిక్కారు.ఓ భూవివాదంలో డిప్యూటీ సీఎం హోమంత్రి పేరు చెప్పుకుని నేరాలకు పాల్పడ్డారు. కొన్ని సెటిల్మెంట్లు చేసే ప్రయత్నం చేయడంతో.. పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం గుంటూరులోని వల్లూరివారి తోటలో… భీం సేన పేరుతో ఓ కార్యాలయం కూడా ప్రారంభించారు. భీంసేన రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ఈ బోరుగడ్డ అనిల్ రమణ దీక్షితులుకు అన్నీ తానై అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. క్రిస్టియన్ మత సంస్థను నిర్వహిస్తూ.. శ్రీవారి సేవల గురించి ప్రెస్మీట్ లో అనిల్ బాధపడ్డారు. రమణదీక్షితులు ఆమరణ దీక్ష చేస్తారని కూడా తనే ప్రకటించారు.
ఇరవై నాలుగేళ్ల పాటు శ్రీవారికి ప్రధాన అర్చకులుగా సేవలందించిన రమణదీక్షితులు…శ్రీవారి ప్రతిష్టను దెబ్బతీసేలా ఆరోపణలు చేయడంతో… టీటీడీ రిటైర్మెంట్ ప్రకటించింది. అప్పట్నుంచి తన ఆరోపణలను మరింత ముమ్మరం చేశారు. లోటస్ పాండ్ కు వెళ్లి వైఎస్ జగన్ తో సమావేశమయ్యారు. అప్పుడే అన్యమతస్తుడి ఇంటికి ఎలా వెళతారన్న విమర్శలు వచ్చాయి. అయినా రమణదీక్షితులు తనను తాను సమర్థించుకున్నారు. తన పొట్టఎవరు నింపితే వారి వద్దకు వెళ్తానని ప్రకటించారు. ఇప్పుడు నేరుగా.. మత ప్రచార సంస్థల నిర్వాహకులతో .. కలిసి.. ప్రెస్ మీట్లు నిర్వహించడం వివాదాస్పదం అవుతోంది.
అసలు రమణదీక్షితులు.. హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించడం వెనుక మరో కారణం ఉందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మిరాశీ అర్చకుల వారసుల ఎంపికలకు.. టీటీడీ ఇంటర్యూలు నిర్వహిస్తోంది. ప్రవేశిక,వర, ప్రవర అనే విభాగాల్లో ఉత్తీర్ణులైన వారికే అర్హత లభిస్తుంది. రమణ దీక్షితుల మనవడు వినీత్ దీక్షితులకు ఈ ఇంటర్యూలకు హాజరయ్యారు. కానీ వినీత్ కు వయసు సరిపోకపోవడం, ప్రవేశిక, వర, ప్రవర పరీక్షల్లో ఉత్తీర్ణుడు కాకపోవడంతో ఎంపిక చేయలేదు. ఇలా జరుగుతుందని తెలిసి.. టీటీడీని బ్లాక్మెయిల్ చేయడానికి రమణదీక్షితులు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారన్న ఆరోపణలున్నాయి. ఇలా చేసినందుకు ఇతర మిరాశీ కుటుంబాలు రమణదీక్షితులపై ఆగ్రహం వ్యక్తం చేశాయి కూడా. ఇప్పుడు ఆ మీడియా సమావేశం కూడా.. క్రిస్టియన్ చారిటీ సంస్థల కనుసన్నల్లో జరగడంతో.. రమణదీక్షితులు మరింతగా తన గౌరవాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది.