సినిమా ప్రమోషన్లు ఇప్పుడు కొత్త రూపం దాల్చుతున్నాయ్. ట్విట్టర్, ఫేస్‌బుక్‌ని వేదిక చేసుకుని… ప్రమోషన్లని మరో స్థాయికి తీసుకెళ్తున్నారు. ట్విట్టర్ సాక్షిగా చేసుకునే సరదా సంభాషణలు కూడా ప్రమోషన్లకు బాగా ఉపయోగపడుతున్నాయి. ‘గీత గోవిందం’ కోసం ఇప్పుడు అదే చేశారు విజయ్ దేవరకొండ, రష్మిక మడన్నా. వీరిద్దరూ జంటగా నటిస్తున్న చిత్రం ‘గీత గోవిందం’. పరశురామ్ దర్శకత్వం వహించారు. ప్రీ లుక్ తో ప్రమోషన్ ఈవెంట్‌ని మొదలెట్టబోతున్నారు. అందుకోసం ట్విట్టర్‌లో విజయ్, రష్మిక సరదాగా సంభాషించుకున్నారు.
రష్మిక : `ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ అట కదా.. కంగ్రాట్స్`
విజయ్: అవార్డులో ఏముంది మేడమ్, మీలాంటి వాళ్లు నన్ను ప్రేమించడం చాలు.. గీతా మేడమ్
రష్మిక: ఇగో గోవిందం, ఈ ఓవరాక్షనే తగ్గించుకోమనేది.. అసలు నీకు కాదు. ప్రభాస్ కో, తారక్ కో ఇస్తే.. మాకు ఈ గొడవ వదిలిపోయేది
ఇలా.. సాగింది ట్విట్టర్‌లో వీళ్ల సంభాషణ. ఇదంతా గీతా గోవిందం ప్రమోషన్ల కోసమని అర్థమైపోతోంది. ప్రమోషన్ ఐడియా బాగుంది. ఇవే తెలివితేటలు సినిమాల్లోనూ చూపిస్తే బాగుంటుంది. మరి పరశురామ్ ఏం చేస్తాడో, ఏంటో?