జనసేన అధినేత పవన్ కల్యాణ్ రంజాన్ సెలవులు ముగించుని ట్విట్టర్లోకి వచ్చారు. వచ్చీ రాగానే తిరుమల తిరుపతి దేవస్థానాల విషయంలో జరుగుతున్న వివాదంపై తనదైన స్టైల్లో స్పందించారు. శ్రీవారి నగలు… కొన్ని సంవత్సరాల కిందటే ఓ ప్రత్యేక విమానంలో మధ్యప్రాచ్యంలోని దేశానికి తరలి పోయినట్లు తనకు తెలుసని ట్వీట్ చేశారు. అప్పట్లో..ఓ ఐపీఎస్ అధికారి… విమానాశ్రయంలో తనకు ఈ విషయాన్ని చెప్పినట్లు పవన్ ట్వీట్లో పేర్కొన్నారు. అందుకే రమణదీక్షితులు చేస్తున్న ఆరోపణలు తనకు ఏ మాత్రం ఆశ్చర్యం కలిగించలేదన్నారు. పవన్ ట్వీట్లలో విశేషం ఏమిటంటే.. అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి కూడా ఈ విషయం తెలుసట..!
రమణదీక్షితులు.. లెవనెత్తిన గులాబీ రంగు వజ్రం, నగల మాయం ఆరోపణలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేంటున్నారు. భక్తులు నాణేలు విసిరితే పింక్ డైమండ్ పగిలిపోయిందన్నట్లు ప్రభుత్వం చెబుతూండటంపై అనుమానం వ్యక్తం చేశారు. మరి మిగతా నగల సంగతేమిటని ప్రశ్నించారు. పింక్ డైమండ్ ఎలా అయితే పగిలిపోయిందంటున్నారో.. అలా ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో సీన్ రీక్రియేట్ ఎందుకు చేయకూడదని పవన్ ప్రశ్నించారు. నాణేలు విసిరే భక్తులకు కూడా వాస్తవాలు తెలియాల్సి ఉంటుందన్న వ్యంగ్యాన్ని పవన్ ట్వీట్ లో జోడించారు. పవన్ కల్యాణ్ ట్వీట్ల ప్రకారం.. కాంగ్రెస్ పార్టీ హయాంలో.. అదీ కూడా వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో… రమణదీక్షితులు ఆగమ సలహాదారుగా, ప్రధాన అర్చకునిగా ఉన్న సమయంలోనే నగలు విదేశాలకు తరలిపోయాయని అర్థం. పింక్ డైమండ్ పగిలిపోయిందని చెబుతున్న సమయంలోనూ… వీరే అధికారంలో ఉన్నారు. భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ గా ఉన్నారు.
పవన్ కల్యాణ్ ట్వీట్ల ప్రకారం.. శ్రీవారి నగలు కాంగ్రెస్ హయాంలో.. మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ కు తరలి వెళ్లాయి. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇజ్రాయెల్‌కు రెండు మూడు సార్లు కుటుంబంతో సహా వెళ్లారు. మరి పవన్ కల్యాణ్‌కు ఈ విషయంలో ఏమైనా సమాచారం ఉందో లేదో ట్వీట్ చేయలేదు. కొద్ది రోజుల క్రితం వైఎస్ జగన్‌తో సమావేశం అయిన .. రమణదీక్షితులు పవన్ కల్యాణ్ ను కూడా కలుస్తానని ప్రకటించారు. పవన్ కల్యాణ్ రమణదీక్షితులు తనను కలవకుండానే… తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ప్రభుత్వంపై నేరుగా ఆరోపణలు చేయలేదు..కానీ రమణదీక్షితులు లేవనెత్తిన అంశాలపై ప్రభుత్వం వివరణ ఇవ్వాల్సిందేనంటున్నారు. అయితే ఎప్పుడో తనకు తెలిసిన విషయాన్ని పవన్ కల్యాణ్ ఇంత కాలం ఎందుకు తనలోనే దాచుకున్నారో అన్న సందేహాలు అందరికీ రావొచ్చు. సరే అప్పుడు సందర్భం లేకపోయినా.. రమణదీక్షితులు టీటీడీపై ఆరోపణలు రెండు నెలలు దాటిన తర్వాత.. ఇప్పుడే ఎందుకు ట్వీట్లు చేశారన్న అనుమానాలు కూడా రావొచ్చు. కానీ వీటికి సమాధానాలు మాత్రం సస్పెన్స్