చికాగో పోలీసులు బయటపెట్టిన… సెక్స్ రాకెట్ కేంద్రంగా.. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీలు, నేతలపై బురద జల్లడం ప్రారభమయింది. నిజానికి చికాగో పోలీసులు అసలు ఎలాంటి విషయాలను బయటపెట్టక ముందే..చిలువలు, పలువలుగా గాసిప్స్ రాసేసి.. దాన్ని తెలుగుదేశం పార్టీకి, తెలుగుదేశం పార్టీ నేతలకు అంటించేసేందుకు ఏ మాత్రం వెనుకాడలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూల ధర్డ్ గ్రేడ్, ఫోర్త్ గ్రేడ్ వెబ్సైట్లు, యూట్యూబ్ చానళ్లు మొదట ఈ ప్రచారాన్ని ప్రారంభించాయి. “తానా” ప్రెసిడెంట్‌ను చికాగో పోలీసులు ప్రశ్నించారని.. . ఆయన టీడీపీ నేతలకు సన్నిహితుడని చెప్పుకొచ్చారు. వీటిని చూసి.. కొమ్మినేని, ఆ తర్వాత సాక్షి మీడియా కూడా ప్రచారం ప్రారంభించింది. చివరి వైసీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ … కూడా ఇవే ఆరోపణలు చేశారు. “తెలుగు 360” అమెరికాలో పదేళ్లుగా తెలుగు సంఘాల కార్యక్రమాలను నిశితంగా పరిశీలిస్తోంది. ఈ విషయంలో… విపరీతంగా ప్రచారం అవుతున్న మూడు గాసిప్స్‌లో నిజనిజాలను మీ ముందు ఉంచుతున్నాం.
గాసిప్ 1: “తానా”తో కిషన్ మోదుగుమూడికి సన్నిహిత సంబంధాలు..!
మాకు తెలిసినంత వరకు..కిషన్ మోదుగుమూడికి “తానా”తో ఎలాంటి సంబంధాలు లేవు. అంటే.. దీనర్థం తానాకు సంబంధించిన మనుషులు ఎవరికీ కిషన్‌తో ఎలాంటి సేవలు పొందలేదని కాదు. కానీ “తానా” మాత్రం.. కిషన్ మోదుగుమూడితో ఎలాంటి వ్యవహారాలను నడపలేదని.. ఆ సంస్థ అధ్యక్షడు సతీష్ వేమన స్పష్టం చేశారు. అయితే ఈ కిషన్ మోదుగుమూడికి మరో తెలుగు సంఘం “అటా” సన్నిహిత సంబంధాలున్న విషయాన్ని ఇదివరకే వెల్లడించాం. 2016లో “అటా” కార్యక్రమాలకు సంబంధించి.. కిషన్ మోదుగుమూడి అలియాస్ శ్రీరాజ్ చెన్నుపాటిని.. టాలీవుడ్ తారలతో కోఆర్డినేట్ చేసుకునే బాధ్యతను అప్పగించామని… ఆ సంస్థ అధ్యక్షుడు అధికారికంగా చెప్పారు. అప్పుడే అనుచితంగా ప్రవర్తించడంతో యాంకర్ అనసూయ, సంపూర్ణేష్ బాబు .. మోదుగుమూడి తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
గాసిప్ 2: మోదుగుమూడి అలియాస్ చెన్నుపాటికి కులం కారణంగా చంద్రబాబుతో సంబంధాలు..!
విషాదం ఏమింటంటే.. చికాగో సెక్స్‌రాకెట్‌కు కులం కోణం జోడించడం. ఏ కులం వాడైనా క్రిమినల్ ఓ క్రిమినలే. టాలీవుడ్‌లోని ఆర్టిస్టులను ఆకర్షించడానికి కిషన్ మోదుగుమూడి.. చెన్నుపాటి అనే ఇంటి పేరును ఉపయోగించుకున్నారు. నిజానికి మోదుగుమూడి కులం అది కాదు. కానీ గాసిప్ వెబ్ సైట్స్ మాత్రం.. ఈ ఇంటి పేరు ఆధారంగా..చంద్రబాబుకు లింక్ పెట్టి ప్రచారం ప్రారంభించేశాయి. అన్నీ పోసుకోలు కబుర్లే.
గాసిప్ 3: త్వరలో హీరోయిన్ల అరెస్టులు..!
ఈ విషయంలో చికాగో పోలీసులు ఇంత వరకూ ఎలాంటి ప్రకటనా చేయలేదు. మాకు తెలిసినంత వరకూ …ఈ విషయంలో.. మోదుగుమూడి దంపతులు మాత్రమే నిందితులు. మిగతా వారంతా బాధితులు. వారంతా విచారణకు సహకరిస్తున్నారు కూడా. అంతకంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే..వారంతా భారత పౌరులు. అందుకే పోలీసులు ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ముందుగా ఉహించడం కరెక్ట్ కాదు.
గతంలో మేము ఎక్స్‌క్లూజివ్‌గా బయటపెట్టిన పత్రాలు, టేపులు మినహా.. కొత్త పరిణామాలు ఏమీ బయటకు రాలేదు. ఏమైనా ఉంటే మేమే అందరికంటే ముందుగా వెల్లడిస్తాం.