చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేస్తూ రూపొందుతున్న సినిమా విజేత. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ కి హాజరైన రాజమౌళి చిరంజీవి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చిరంజీవి పెద్ద హీరో, మంచి నటుడు, మంచి డాన్సర్, మంచి ఫైటర్ ఇవన్నీ ప్రేక్షకులకు తెలుసు. కానీ ఇండస్ట్రీ లోపలి జనాలకు మాత్రమే తెలిసిన విషయం ఏంటంటే- చిరంజీవి స్టోరీ జడ్జిమెంట్ విషయంలో గొప్ప నైపుణ్యం కలిగిన వ్యక్తి. ప్రతి కథలో ఎక్కడ ఏది పెంచాలో, ఏ ఎమోషన్ తగ్గించాలి బాగా తెలిసిన వ్యక్తి. మగధీర సమయంలో కూడా నేను కథ మొదటిగా చిరంజీవి కే చెప్పాను . కాబట్టి చిరంజీవి గారు ఒక కథను ఓకే అన్నారంటే పరిశ్రమలో ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోతాయి. ఇప్పుడు ఈ విజేత కథ చిరంజీవిగారు ఓకే అన్న తర్వాతే తెరకెక్కింది కాబట్టి కచ్చితంగా ఇది బాగుంటుంది అన్న నమ్మకం అందరికీ ఉంది.. ఇలా సాగింది రాజమౌళి ప్రసంగం.
చిరంజీవి స్టోరీ జడ్జిమెంట్ విషయంలో ఎంత పర్ఫెక్ట్గా ఉంటాడు అన్న విషయాన్ని గుర్తు చేసిన రాజమౌళి ఈ విషయం ఇండస్ట్రీ జనాలకు మాత్రమే బాగా తెలుసు అని చెప్పడం మాత్రం పూర్తి నిజం కాదు. నిశితంగా పరిశీలించి ప్రేక్షకులు చాలాసార్లు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు గతంలో ఈ విషయమై చిరంజీవి ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందో ఆడియో ఫంక్షన్ లో ఆయన మాటలు చూస్తేనే అర్థమవుతుంది అని చర్చించిన విషయం తెలిసిందే. ( https://www.telugu360.com/te/chiranjeevi-hints-about-movie-in-events/ )
మరి ఈసారి చిరంజీవి స్టోరీ జడ్జిమెంట్ ఎంత వరకు పర్ఫెక్ట్ అన్నది విజేత విడుదలయ్యాక తెలుస్తుంది.