రేణూదేశాయ్ నిశ్చితార్థం ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌కి తెర లేపింది. పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ అయితే… ఈ విషయంపై ఎక్కువగా చర్చించుకుంటున్నారు. రేణు కొత్త భర్త ఏం చేస్తాడు? అతని పేరేంటి? ఇలా ఎన్నో ప్రశ్నలు. అయితే రేణు మనసు పెళ్లిపై మళ్లిందని, తను మరో పెళ్లి చేసుకోవడానికి రెడీగానే ఉందని ఎప్పటి నుంచో సూచనలు అందుతూనే ఉన్నాయి. రేణు కూడా కొన్ని సార్లు మరో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. `రేణు మనసులో ఎవరో ఉన్నారు` అనే విషయం అప్పటి నుంచే ఫ్యాన్స్‌కి తెలుసు. అందుకే.. రేణు నిశ్చితార్థం వాళ్లకేమీ షాక్ ఇవ్వలేదు. కాకపోతే.. అతను ఎవరు? ఏమిటి? అనే విషయాలపై ఫోకస్ పెట్టారు.
అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు… కొత్త భర్తతో పరిచయం ఇప్పటి విషయం కాదట. `గబ్బర్ సింగ్` సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడిందని, పవన్ విడాలకులతో వీరిద్దరి బంధం బలపడిందని తెలుస్తోంది. నిజానికి పవన్‌తో విడాకులు తీసుకున్న యేడాదిలోగానే పెళ్లి చేసుకోవాలనుకుంది రేణు. కాకపోతే..ఆ పెళ్లి కోసమే విడాకులు తీసుకుందనే తప్పుడు సంకేతాలు అందకూడదన్న ఉద్దేశంతోనే ఇన్నాళ్లూ ఆగిందట. వరుడిది రాజస్థాన్ అని కొందరు, కాదు.. పుణే అని ఇంకొందరు చెబుతున్నారు. రేణు నోరు విప్పే వరకూ అసలు నిజాలేం బయటకు రావు. మరి… రేణు తన భర్తని ఎప్పుడు పరిచయం చేస్తుందో.??