తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సబ్యుడు సీఎం రమేష్.. ఉక్కు దీక్షలో..మరింత పట్టుదల కనబరుస్తున్నారు. ఆయన దీక్ష నేటితో పదో రోజుకు చేరింది. ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే ఆయనను ఐసీయూలో ఉంచి చికిత్స చేయాల్సిన పరిస్థితులో ఉన్నారని… వైద్యులు చెబుతున్నారు. అయితే రమేష్ మాత్రం.. తాను ఎట్టి పరిస్థితుల్లోనూ… దీక్ష నుంచి వెనక్కి తగ్గే అవకాశం లేదని స్పష్టం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఎంపీలు రెండు రోజులుగా ఢిల్లీలో ఉక్కు మంత్రితో మూడు సార్లు సమావేశం అయ్యారు. ఎప్పుడూ చెప్పేదే చెప్పారు. బీరేంద్ర సింగ్ మాత్రం… నేరుగా సీఎం రమేష్ కు ఫోన్ చేసి మాట్లాడారు. మెకాన్ సంస్థ నివేదిక రాగానే.. అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని.. సర్దిచెప్పే ప్రయత్నం చేశారు దీక్ష విరమించాలని కోరారు. కానీ సీఎం రమేష్ మాత్రం… అనుకూలమైన ప్రకటన చేయాల్సిందేనని పట్టుబట్టారు.
కడప జిల్లా ప్రజల భావోద్వేగాలకు సంబంధించిన అంశం కాబట్టి.. వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. రెండు మూడు రోజుల్లో నిర్ణంయ తీసుకోకపోతే.. తన డెడ్ బాడీని చూస్తారని ఖరాఖండిగా చెప్పారు. దీంతో బీరేంద్ర సింగ్ కు ఏం చేయాలో పాలుపోవడం లేదు. మరో వైపు ప్రదానమంత్రి నరేంద్రమోడీ… ఏపీ ఎంపీలకు సమయం ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేరు. ఆంధ్రప్రదేశ్ లో స్టీల్ ప్లాంట్ కోసం జరుగుతున్న ఆందోళనలను వివరించేందుకు ఐదు నిమిషాల అపాయింట్మెంట్ అడిగిన ఎంపీలకు నిరాదరణే ఎదురయింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పదిహేను మందికిపైగా ఎంపీలు.. సమయం అడిగినా పీఎంవో వర్గాలు నిర్ ద్వంద్వంగా తిరస్కరించారు. ఓ రాష్ట్రానికి చెందిన దాదాపు అందరూ ఎంపీలు వస్తే ప్రధాని మోదీ కలవడానికి నిరాకరించడం… ఇతర రాజకీయ పార్టీల్లోనూ చర్చనీయాంశమయింది.
ఏపీకి సంబంధించిన ప్రతి ప్రాజెక్టు కానీ.. విడుదల కావాల్సిన ప్రతి రూపాయి కానీ.. మోదీ ఆమోదానికి వెళ్లాల్సిందేనని కేంద్ర ప్రభుత్వ వర్గాలు బహిరంగంగానే చెబుతున్నాయి. గతంలో.. వెనుకబడిన జిల్లాలకు కేంద్ర ఆర్థిక శాఖ 350 కోట్ల రూపాయలు విడుదల చేసింది. కానీ ప్రధానమంత్రిని ముందుగా అడగలేదని.. ఆన పర్మిషన్ ఇవ్వలేదన్న కారణంగా ఆ నిధులను వెనక్కి తీసుకున్నారు. ఇంత వరకూ విడుదల చేయలేదు. అదే కాదు.. విభజన హామీల విషయంలో మోదీ, అమిత్ షా కలసి నిర్ణయం తీసుకుంటారని.. బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కేంద్ర మంత్రులు ఏ నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. కేంద్రంతో పాటు సీఎం రమేష్ కూడా మొండి పట్టుదలకు పోతూండటంతో.. కడపలో అంతకంతకూ టెన్షన్ పెరిగిపోతోంది.