నందమూరి, అక్కినేని, దగ్గుబాటి, ఘట్టమనేని, కొణిదెల (మెగా)… తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలు. ఇండస్ట్రీకి పేరు తెచ్చిన కుటుంబాలు. ఇండస్ట్రీ అభివృద్ధిలో వీళ్లకీ కొంత భాగం వుంది. చిరంజీవి కంటే ముందే ఎన్టీఆర్, ఏయన్నార్, రామానాయుడు, కృష్ణ ఇండస్ట్రీకి వచ్చారు. రామానాయుడు నిర్మాతగా, మిగతావారు హీరోలుగా అగ్రపథంలో దూసుకువెళ్లారు. మద్రాస్ నుంచి హైదరాబాద్కి ఇండస్ట్రీ షిఫ్ట్ అయినప్పుడు అందరూ స్టూడియోలు కట్టారు.
నందమూరి ఫ్యామిలీకి రామకృష్ణ స్టూడియో వుంది. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియోలు (రెండు) వున్నాయి. ఘట్టమనేని ఫ్యామిలీకీ పద్మాలయ స్టూడియో వుంది. దగ్గుబాటి ఫే ఫ్యామిలీకి రామానాయుడు స్టూడియోలు (రెండు) వున్నాయి. ఇప్పటివరకూ మెగా ఫ్యామిలీకి సొంత స్టూడియో లేదు. త్వరలో ఆ లోటు తీర్చుకోవాలని రామ్చరణ్ భావిస్తున్నార్ట. సొంత స్టూడియో కోసం చరణ్ స్కెచ్ రెడీ చేశారు. హైదరాబాద్ నారా శివార్లలోని కోకాపేట్ దగ్గరలో ప్రస్తుతం చిరంజీవి ‘సైరా నరసింహారెడ్డి’ షూటింగ్ చేస్తున్నారు. మెగా ఫ్యామిలీకి చెందిన 22 ఎకరాల స్థలంలో స్పెషల్ సెట్స్ వేశారు. ఇదే స్థలంలో స్టూడియో కట్టాలనేది రామ్చరణ్ ప్లాన్ అని టాక్. గతంలో ఓసారి మెగా ఫ్యామిలీ సొంత స్టూడియో కడుతుందని వార్తలు వచ్చినా కార్యరూపం దాల్చలేదు. ఈసారైనా నిజం అవుతుందో… మెగా కలగా మిలుతుందో? ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో అరడజనుమందికి పైగా హీరోలున్నారు. అందులో నలుగురైదురు పెద్ద హీరోలే. వాళ్ల షూటింగులు సొంత స్టూడియోలో ప్లాన్ చేసినా స్టూడియో నిర్వహణ లాభసాటి వ్యాపారమే.