హ్యాపీ వెడ్డింగ్ అంటూ వస్తున్నారు సుమంత్ అశ్విన్, నీహారిక కలిసి. ఈ సినిమా వ్యవహారం ‘రెడ్డి వచ్చే మొదలాడు’ అన్నట్లు వుందట. వాస్తవానికి ఈ సినిమాకు డైరక్టర్ ఎవరయినా, సుమంత్ అశ్విన్ తండ్రి ఎమ్ ఎస్ రాజు మొత్తం తన మీద వేసుకుని పని కానిచ్చేసారు. అంతా అయిపోయాక ప్రభాస్ తో తనకున్న సాన్నిహిత్యతో యువి వంశీరెడ్డి దగ్గరకు తెచ్చారు. దాంతో దాని చెక్కుడు పని ప్రారంభించారట.
మొట్టమొదట చేసిన పని, ఆ సినిమాకు అప్పటికే చేసిన రీరికార్డింగ్ మొత్తం పక్కన పడేసారు. ఫిదా మ్యూజిక్ డైరక్టర్ చేసిన రీరికార్డింగ్ అస్సలు సెట్ కాలేదని, మళ్లీ థమన్ తో చేయించారు. అప్పుడు కాస్త బాగుందనిపించిందట. ఆపైన మళ్లీ ఎడిటింగ్ మొదలెట్టారు. అది పూర్తి చేసి, హమ్మయ్య ఓకె అనిపించుకున్నారట.
ఆ విధంగా హ్యాపీ వెడ్డింగ్ కు అన్నీ ఒకటికి రెండుసార్లు అన్నట్లు జరుగుతున్నాయి. విడుదల లోగా ఇంకేం మారతాయో?
అయినా పెద్ద రాజుగారు తన డైరక్షన్ ఆసక్తి తొ చినరాజా వారి హీరో కెరీర్ పాడు చేస్తున్నారని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. అవి ఎంతవరకు నిజమో?