సమ్మోహనం సినిమా విడుదలై ఇంకా మూడు వారాలు కాలేదు. అయితే దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మాత్రం మరో సినిమాకు రెడీ అయిపోయారు. సమ్మోహనం సినిమాను నైజాం, వైజాగ్ లకు పంపిణీ చేసిన నిర్మాత దిల్ రాజు విడుదల టైమ్ లోనే ఇంద్రగంటి తరువాత సినిమా తనదే అని ఓ మాట తీసేసుకున్నారు. అయితే మాట ఇచ్చి ఊరుకోలేదు ఇంద్రగంటి.
నిన్నిటికి నిన్న అంటే గురువారం దిల్ రాజు ను కలిసి, కథ మొత్తం చెప్పేసారు. ఓకె అనిపించేసుకున్నారు. హీరో ఎవరు అనుకుంటున్నారు అంటే మాత్రం, ఛాయిస్ మీదే అని దిల్ రాజుకే వదిలేసారు. తను అడిగితే ఎవరు ఊ అంటారో? ఎవరు నో అంటారో? అదే దిల్ రాజు అయితే ఏ హీరో ను అయినా తేగలరు. అదీ ఇంద్రగంటి అయిడియా.
మొత్తం మీద దిల్ రాజూ ఫాస్ట్ గా వున్నారు సినిమాల ప్లానింగ్ లో. ఇంద్రగంటీ ఫాస్ట్ గా వున్నారు తరువాత సినిమా మీద. అందువల్ల త్వరలో మాంచి క్లాసిక్ ఫన్ ఒకటి బయటకు వస్తుంది. మరి ఆ సినిమా చాన్స్ ఏ హీరో అందిపుచ్చుకుంటారో? నాని-ఇంద్రగంటి-దిల్ రాజు అయితే బాగుంటుంది కానీ, ఇప్పటికే నాని ఓ కొత్త డైరక్టర్ కాంబినేషన్ లో దిల్ రాజు డైరక్షన్ లో ఓ సినిమా స్టార్ట్ చేస్తున్నారు. అందువల్ల వేరే హీరోలు ఎవరయినా సెట్ కావాలి. నిఖిల్ ఓ సినిమా దిల్ రాజుకు చేయాల్సి వుంది. అందువల్ల ఆ కాంబినేషన్ సెట్ అయినా కొత్తగానే వుంటుంది.